అమీర్ ఖాన్‌తో చేయాలనుంది: రాజమౌళి
ఆయన పిటిఐతో మాట్లాడుతూ...అమీర్ ఖాన్ సినిమాలంటే తనకంతో ఇష్టమని వెల్లడించారు. 'బాలీవుడ్లో అందరూ ఇష్టమే. అయితే అమీర్ ఖాన్ సినిమాలంటే మరింత ఎక్కువ ఇష్టం. నేను అతన్ని ఆరాధిస్తాను... నా గురువుగా భావిస్తాను. ఆయన సినిమాలు చేసే పద్దతి అంటే నాకెంతో ఇష్టం. అతను సినిమాలు ప్రమోట్ చేసే విధానాన్ని ఆసక్తిగా పరిశీలిస్తాను. అవకాశం వస్తే ఆయనతో సినిమా చేస్తా. అమీర్ ఖాన్ నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది' అంటూ రాజమౌళి వ్యాఖ్యానించారు.
'ఆయనతో బాలీవుడ్ సినిమా చేయాలని ఉంది. హిస్టారికల్ లేదా మైథలాజికల్ సినిమా చేయాలనే ఆలోచన ఉంది. అలా అని బాలీవుడ్ లోనే కొనసాగాలనే ఉద్దేశ్యం లేదు. నేను ఎంచుకునే మైథలాజికల్ స్టోరీ లేదా హిస్టారికల్ స్టోరీ కంటెంట్ పవర్ ఫుల్ గా బలంగా ఉండాలని భావిస్తున్నాను. రాణా ప్రతాప్, అక్భర్, శివాజీ మరియు ఔరంగ జేబు స్టోరీలు అంటే ఇష్టం' అని రాజమౌళి చెప్పుకొచ్చారు.
వచ్చే రెండు సంవత్సరాల్లో కథను సిద్ధం చేసుకుంటాను. అమీర్ ఖాన్ తో మాట్లాడిన తర్వాత అతను ఒప్పుకుంటే...... ఏ విషయం అనేది ఖరారు చేస్తాను అనే విధంగా రాజమౌళి సంకేతాలు ఇచ్చారు. రాజమౌళి మాటలను బట్టి భవిష్యత్ లో వీరి కాంబినేషన్లో సినిమా ఉండటం ఖాయంగా కనిపిస్తోంది. గతంలో ఓ సందర్భంలో కూడా రాజమౌళి దర్శకత్వంలో చేయాలని ఉందని అమీర్ తన మనసులోని మాట బయట పెట్టిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications












