తెలుగోడి గౌరవాన్ని పెంచిన రాజమౌళి.. సాహోరే అంటోన్న నెటిజన్లు

మనం ఎక్కడికి వెళ్లినా.. మన కట్టు బొట్టుతోనే గుర్తిస్తారు. అందులోనూ తెలుగోడి కట్టుబొట్టుకు ఎంతో ప్రాముఖ్యత, విశిష్టత ఉంది. అంతర్జాతీయ వేదికలపై పంచెకట్టుతో కనిపిస్తే.. ఆ వేదికకే అందం వస్తుంది. అలా మన ఉనికి చెప్పకనే చెప్పేశాడు.. మన గొప్పతనాన్ని చాటిచెప్పాడు రాజమౌళి.

లండన్ రాయల్ ఆల్బర్ట్ హాల్‌లో..

లండన్ రాయల్ ఆల్బర్ట్ హాల్‌లో..

బాహుబలి చిత్రంతో దేశవిదేశాల్లో తెలుగోడి సత్తాను చాటి చెప్పిన దర్శక ధీరుడు.. మరోసారి మన సంప్రదాయ విలువలకున్న విశిష్టతను రుచిచూపించాడు. ప్రస్తుతం లండన్‌లో బాహుబలికి సంబంధించిన లైవ్ కాన్సర్ట్‌ను ప్రదర్శిస్తున్న సంగతి తెలిసిందే. వీటికోసం రానా, ప్రభాస్, అనుష్క అందరూ తరలివెళ్లారు.

జక్కన్నను చుట్టుముట్టిన జపాన్ అభిమానులు..

జక్కన్నను చుట్టుముట్టిన జపాన్ అభిమానులు..

లండన్ వీధుల్లో వెళ్తున్న జక్కన్నను చూసిన జపాన్ అభిమానులు చుట్టుముట్టారు. ఆనందం పట్టలేక గంతులేశారు. రాజమౌళి వారిని ఎంతో ఆప్యాయంగా పలకరించాడు. దీన్ని బట్టే అర్థమవుతోంది.. బాహుబలి రేంజ్ ఏంటి అన్నది. ఇక జపాన్ అభిమానులతో జక్కన్న మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంది.

కిక్కిరిసిన రాయల్ ఆల్బర్ట్ హాల్...

కిక్కిరిసిన రాయల్ ఆల్బర్ట్ హాల్...

లైవ్‌ మ్యూజిక్ కాన్సర్ట్ జరుగుతున్న ఆ హాల్.. జనంతో కిక్కిరిసిపోయింది. దేశవిదేశాల నుంచి వచ్చిన ప్రతినిధులు, అభిమానులతో ఆ ప్రాంగణమంతా కోలాహలంగా మారింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

పంచెకట్టుతో దర్శనమిచ్చిన దర్శకధీరుడు..

పంచెకట్టుతో దర్శనమిచ్చిన దర్శకధీరుడు..

ప్రపంచ వేదిక మీద అందరి కంటే భిన్నంగా కనిపిస్తే.. అదీ మన అచ్చమైన సంప్రదాయ కట్టుతో కనిపిస్తే వచ్చే కిక్కే వేరు. అందరి కళ్లు వారిపైనే ఉంటాయి. అలా దర్శకధీరుడు రాయల్ ఆల్బర్ట్ హాల్‌లో పంచెకట్టుతో దర్శనమిచ్చి.. మన ఖ్యాతిని పెంచాడని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అసలైన తెలుగోడు.. సాహోరే అంటూ పంచెకట్టుతో ఉన్న ఫోటోలను తెగ వైరల్ చేసేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X