రాజమౌళికి అసలు సిసలైన పరీక్ష ఆ హీరో సినిమాతోనే...?
తను తీయబోయే సినిమాల విషయంలో ఎప్పుడూ పకడ్బందీ కథతో, క్లియర్ గా ఉండే రాజమౌళి మొదటిసారి కన్ ప్యూజ్ అవుతున్నాడు, ప్రభాస్ తో తీసే సినిమా ఎలా ఉండాలనే విషయంలో రాజమౌళికి ఇంకా స్పష్టమైన అవగాహన లేదు. 'మగధీర" తర్వాత ఎస్కేపిజం ప్రదర్శించి మర్యాద రామన్న, ఈగలాంటి చిన్న చిత్రాలు తీసిన రాజమౌళి మళ్లీ ప్రభాస్ సినిమాతో తన జోన్ లోకి రానున్నాడు.
నిజానికి 'మగధీర" తర్వాత అతను తీసిన రెండు సినిమాలు కౌంట్ లోకి రావు. కావాలని తన జోన్ లోంచి బయటకి వచ్చి చేసినవి కాబట్టి, రాజమౌళి కి 'మగధీర" తర్వాత సిసలైన పరీక్ష పెట్టేది ప్రభాస్ సినిమానే. అందుకే ఇది ఎలాంటిదైతే బాగుంటుందనే విషయంలో రాజమౌళి ఇప్పటికీ తేల్చుకోలేకపోతున్నాడు. చారిత్రక చిత్రం చేయాలా, పౌరాణికం చేయాలా, లేక యాక్షన్ సినిమా తీయాలా అంటూ తల పట్టుకున్నాడు. ఇప్పటికే రాజమౌళి స్ర్కిప్ట్ డిపార్ట్ మెంట్ అంతా కూర్చుని ఈ సినిమాకోసం కథ వండే పనిలో పడింది. ఫైనల్ గా ఏది బాగుందనిపిస్తే దానికి ఫిక్స్ అవుతాడు. మొదటి సారి తన సినిమా విషయంలో క్లారిటీ మిస్ అవుతున్న రాజమౌళి ఈసారి కూడా బాక్సాఫీస్ ని గెలుస్తాడా లేక ఈ కన్ ఫ్యూజన్ లో మొట్టమొదటి సారిగా ప్లాపవుతాడా?


Click it and Unblock the Notifications











