twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అమరావతి నిర్మాణం లో రాజమౌళి అంతా ఉత్తిదే: తేల్చి పడేసిన విజయేంద్ర ప్రసాద్

    ఆంధ్ర ప్రదేశ్ కొత్త రాజధాని అమరావతి నిర్మాణం లో దర్శకుడు రాజమౌళి పాలుపంచుకోవటం నిజం కాదని ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ స్పష్టం చేసాడు

    |

    'బాహుబలి' సినిమాతో భారతీయ సినీ రంగంలో సంచలనం సృష్టించిన దర్శకుడు రాజమౌళి సేవలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వినియోగించుకోవాలని చూస్తోంది. ఆ సినిమా చూసిన వారు మహిష్మతి రాజ్యాన్ని మర్చిపోలేరంటే అతిశయోక్తి కాదేమో. ఈ క్రమంలో దేశ సంస్కృతి, చరిత్రపై మంచి పట్టున్న జక్కన్న సేవలను ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంలో వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించారు అంటూ ఒక వార్త ఈ మధ్య బాగా వినిపించింది.

    రాజధాని ప్రాంతంలోని ప్రభుత్వ భవనాల ఆకృతుల రూపకల్పనలో రాజమౌళి సలహాలు, సూచనలు తీసుకోవాలని రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) అధికారులను చంద్రబాబు ఆదేశించారు. దీంతో బుధవారం మంత్రి పి.నారాయణ ఆధ్వర్యంలో సీఆర్‌డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీధర్ సహా ఇతర అధికారుల బృందం రాజమౌళితో హైదరాబాద్‌లో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

    Rajamouli will not be overlooking Amaravati's designs

    శాసనసభ, హైకోర్టుల నమూనాలపై సలహాలు ఇవ్వాలని కోరారు. దాదాపు గంటపాటు రాజమౌళితో సమావేశమై రాజధానిలో నిర్మించనున్న భవనాలపై చర్చించారు. తెలుగు రాష్ట్రాల చరిత్ర, సంస్కృతులు, మూడు ప్రాంతాల్లోని రాజుల చరిత్రపై చర్చించినట్టు తెలుస్తోంది. ఈ సందర్బంగా రాజమౌళి మాట్లాడుతూ అమరావతి నిర్మాణంలో తన వంతు సహకారం అందిస్తానని, తగిన సూచనలు, సలహాలు అందించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్టు చెప్పినట్టు సమాచారం. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న "బాహుబలి-2" పూర్తయిన తర్వాత ఇందుకోసం తగిన సమయం కేటాయిస్తానని, తనను కలిసిన బృందానికి హామీ ఇచ్చినట్టు తెలిసింది. అంటూ కొన్ని పత్రికలు రాసేసాయి కూడా. కొందరు నమ్మినా మరికొందరు మాత్రం ఔనా..! అంటూ కాస్త అనుమానం గానే చూసారు.

    ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్ఎస్‌.రాజ‌మౌళి బాహుబ‌లి సినిమాతో ఇంట‌ర్నేష‌న‌ల్‌గా సూప‌ర్ పాపుల‌ర్ అయ్యారు. బాహుబ‌లి సినిమా ప్ర‌పంచ‌వ్యాప్తంగా రూ.600 కోట్ల గ్రాస్ వ‌సూళ్లు రాబ‌ట్టి తెలుగు సినిమా ఖ్యాతిని ఎల్లలు దాటించేసింది. ఓ తెలుగు చిత్రానికి ఈ స్థాయిలో పేరు రావడం ఇదే మొదటి సారి. బాహుబలి సినిమాలోని మ‌హిష్మ‌తి సామ్రాజ్యం సెట్టింగులు, గ్రాఫిక్స్ అన్ని రాజ‌మౌళి విజ‌న్‌కు నిద‌ర్శ‌నంగా నిలిచాయి.భార‌తీయ సంస్కృతి, సంప్ర‌దాయాల‌పై రాజ‌మౌళికి ఎంతో ప‌ట్టుంది. రాజ‌మౌళి త‌న డ్రీమ్ ప్రాజెక్టుగా చెపుతోన్న మ‌హాభార‌తాన్ని తెర‌కెక్కిస్తే ఏం రేంజ్‌లో ఉంటుందో ఊహ‌కే అంద‌డం లేదు.

    ఇప్పుడు రాజ‌మౌళికి ఉన్న ఈ విజ‌న్‌ను ఏపీ సీఎం చంద్ర‌బాబు ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణంలో ఉప‌యోగించుకునే ప‌నిలో ఉన్నార‌నగానే ఒక్కసారి బాహుబలిలోని మాహిష్మతీ రాజ్యం కళ్ళ ముందు కదిలింది. అయితే ఇప్పుడు అసలునిజం ఏమిటంటే ఈ వార్తలన్నీ వట్టి రూమర్లేనట. ఈవిషయాన్ని చెప్పింది ఎవరో కాదు రాజమౌళి తండ్రి.. బాహుబలి రైటర్ విజయేంద్ర ప్రసాద్ . ఇవన్నీ రూమర్లే అని కొట్టి పారేసిన ఆయన.. ఇది అసాధ్యమైన విషయం అన్నారు. మాహిష్మతి రాజ్యాన్ని తిరిగి నిర్మించాలని భావించినా.. ఆ చిత్రానికి పని చేసిన ఆర్ట్ డైరెక్టర్ ను సంప్రదిస్తారు తప్ప.. సినిమా దర్శకుడిని కాదని తేల్చేశారు విజయేంద్ర ప్రసాద్.

    English summary
    Even, if the Andhra government was impressed with the VFX-based Mahishmati kingdom, it would have been logical to approach the art director. However, Rajamouli's father Vijendra Prasad has clarified that the news is a mere rumour.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X