చిరు వేసిన బాటలో నీవు... సాయం చేశావా? నేను కష్టపడి పైకివచ్చా... ఆకలితో చస్తా గానీ.. పవన్‌పై అలీ ఫైర్

Recommended Video

Ali Made Serious Comments On Pawan Kalyan || Filmibeat Telugu

తనను మోసం చేశాడని పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై సినీ నటుడు అలీ తీవ్రంగా స్పందించాడు. పవన్ తీరుపై ధ్వజమెత్తుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల రాజమండ్రిలో ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ కష్టాల్లో ఉన్న అలీకి తాను సాయం చేశానని, అలాంటి వ్యక్తి తనను మోసం చేశాడని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించడం తెలిసిందే. పవన్ చేసిన వ్యాఖ్యలను తప్పుపడుతూ అలీ ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఆయన ఏమన్నారంటే..

పక్కన ఎవరో గిల్లి ఉంటారేమో

పక్కన ఎవరో గిల్లి ఉంటారేమో

రెండు రోజుల క్రితం రాజమండ్రిలో నాపై చిన్న కామెంట్ చేశారు. నేను పుట్టింది.. పెరిగింది రాజమండ్రిలోనే. నేను పుట్టిన గడ్డకు ఏదైనా చేయాలన్న ఉద్దేశంతో నా తండ్రి పేరుతో చారిటీ పెట్టి అక్కడి ప్రజలకు సేవచేస్తున్నాను. అలాంటి నన్ను ఉద్దేశించి మీకు వ్యాఖ్యలు చేయాలనే ఆలోచన రాకపోవచ్చు. కానీ పక్కన ఉండేవాళ్లు అలా మాట్లాడేందుకు నిన్ను గిల్లి ఉంటారేమో అని అలీ అన్నారు.

తిండి కోసం చాలా కష్టపడ్డాను

తిండి కోసం చాలా కష్టపడ్డాను

నా గురించి మరే జిల్లాలో కామెంట్ చేసి ఉంటే నేను ఈ వీడియో విడుదల చేసేవాడిని కాదు. ఎందుకంటే మీరు చిరంజీవి వేసిన బాటలో మీరు వచ్చారండి. కానీ నా బాట నేనే వేసుకొన్నాను. నేనే నడిచాను. నాకు బ్యాక్ గ్రౌండ్ సపోర్ట్ లేదు. పుట్టింది పెరిగింది రాజమండ్రిలో.. జీవనాధారం కోసం చెన్నై వెళ్లి తిండి కోసం కష్టపడ్డాను. ఎంతో కృషి చేస్తే ఈ స్థాయికి ఎదిగాను. చెన్నై నాకు జీవితాన్ని ప్రసాదించింది.

మీ స్థానం నా గుండెల్లోనే

మీ స్థానం నా గుండెల్లోనే

నా జీవితంలో నా నుంచి ఎవరైనా లాభం పొందారే తప్ప.. నేను ఎవరి వద్ద చేయి చాచి లాభం పొందలే. నేను వైఎస్ఆర్ సీపీలో చేరి చాలా జిల్లాలో ప్రచారం చేశాను. కానీ పవన్ కల్యాణ్ గురించి కానీ, జనసేన గురించి కానీ ఎలాంటి కామెంట్ చేయలేదు. గతంలో చెప్పాను.. ఇప్పుడు చెబుతున్నాను. మీ స్థానం ఎప్పటికే నా గుండెల్లోనే ఉంటుంది.

మీరు ఎదగాలని కోరుకొన్నా

మీరు ఎదగాలని కోరుకొన్నా

సార్.. మీ పార్టీ పెట్టేటప్పుడు మీ ఆఫీస్‌కు వచ్చాను. మీరు రాజకీయాల్లో ఎదుగాలని కోరుకుంటూ ఖురాన్, డేట్స్ ఇచ్చాను. మీరు బాగుండాలని కోరుకొనే వ్యక్తుల్లో మొదటి లైన్లో మొదటి వ్యక్తిని నేను. అలీ కష్టాల్లో ఉన్నప్పుడు సాయపడ్డాను అని మీరు ఓ మాట అన్నారు. మీరు ఏ విధంగా సాయపడ్డారో చెప్పాలి అని అలీ అన్నారు.

నాకు మీరు ఆఫర్లు ఇప్పించారా?

నాకు మీరు ఆఫర్లు ఇప్పించారా?

నేను కష్టాల్లో ఉన్నప్పుడు సాయపడ్డారంటే.. నాకేమైనా డబ్బు ఇచ్చారా? కష్టాల్లో ఉంటే డబ్బు.. అవకాశాలు లేకపోతే ఆఫర్లు ఇప్పించారా? మీరు ఇండస్ట్రీకి రాకముందే నేను మంచి పొజిషన్లో ఉన్నాను. ఎవరి వద్దకో వెళ్లి సాయం కోరే స్థితిలో నేను. అల్లా దయవల్ల మంచి పొజిషన్లో ఉన్నాను. పరిస్థితి బాగా లేకపోతే ఆకలితో చచ్చిపోతాను తప్ప దేహీ అని యాచించను. అలాంటి వ్యక్తిని అయిన నాపై మీరు రాజమండ్రిలో కామెంట్ చేయడం బాధగా ఉంది.

నాకు టికెట్ ఇవ్వమని అడిగానా?

నాకు టికెట్ ఇవ్వమని అడిగానా?

నా చుట్టానికి టికెట్ ఇచ్చానని చెప్పాను. నేను ఎప్పటికైనా అడిగానా? టికెట్ ఇవ్వమని అడిగానా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం తప్పా? ఒకవేళ ఆ పార్టీలో చేరడం ఇష్టం లేకపోతే నాకు ఫోన్ చేసి ఏంటి అలీ నీవు ఇలాంటి నిర్ణయం తీసుకొన్నావు. నేను పార్టీ పెట్టాను.. పార్టీలో చేరవవచ్చని అడిగావా? అని అలీ ప్రశ్నల వర్షం కురిపించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X