సూపర్ స్టార్ అదరకొడుతున్నాడు(కొత్త ఫొటోలు)

By Srikanya

హైదరాబాద్ : సౌతిండియా సూపర్ స్టార్ రజనీకాంత్‌ అంటేనే స్త్టెల్‌. పాట, ఫైటు, డైలాగ్‌.. ఇలా ఎందులోనైనా తనదైన శైలిని చూపిస్తూ వస్తున్నారాయన. నటన, ఫైట్‌లలోనే కాదు పాటల్లోనూ తనదైన స్త్టెల్‌తో స్టెప్పులు వేసి అలరిస్తుంటారాయన. తన తాజా చిత్రం 'లింగా'లోనూ ఇదే తరహాలో వైవిధ్యమైన స్టెప్పులు వేస్తున్నారు. ఆ స్టైల్ ని ఫస్ట్ లుక్ గా మొన్నో సారి వదిలి ఫ్యాన్స్ కు పండగ చేసారు. ఇప్పుడు మరోసారి మరో ఫొటోతో ముందుకు వచ్చారు దర్శక,నిర్మాతలు.

''చిత్రంలో రజనీకాంత్‌ మాస్‌ మసాలా యాక్షన్‌ హీరోగా కనిపిస్తాడు. అన్ని వర్గాలవారినీ అలరించేలా దర్శకుడు కె.ఎస్‌.రవికుమార్‌ చిత్రాన్ని సిద్ధం చేస్తున్నారు. సినిమాలో రజనీ పాత్ర చిత్రణ సరికొత్తగా ఉంటుంద''ని చెబుతున్నారు నిర్మాత.

చిత్ర హీరోయిన్స్ అనుష్క, సోనాక్షి సిన్హాలతో మాస్‌ పాటలు, క్లాస్‌ పాటలున్నాయట. తాజాగా రామోజీ ఫిల్మ్‌సిటీలో రజనీకాంత్‌, సోనాక్షిసిన్హాపై పాటను చిత్రీకరిస్తున్నారు. సాబు సిరిల్‌ ప్రత్యేకంగా రూపొందించిన సెట్‌లో షూటింగ్‌ జరుగుతోంది.

చిన్ని ప్రకాష్‌, రేఖ ప్రకాష్‌ నృత్య రీతులు సమకూరుస్తున్నారు. ఈ నెల 22 (ఈ రోజు) వరకు ఇక్కడ షూటింగ్ ఉంటుంది. దీని తర్వాత విదేశాల్లో మరో పాటను చిత్రీకరిస్తారు. కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి రాక్‌లైన్‌ వెంకటేష్‌ నిర్మాత.

మిగతా విశేషాలు...ఫొటోలు స్లైడ్ షోలో...

దర్శకుడు మాట్లాడుతూ...

దర్శకుడు మాట్లాడుతూ...

''రజనీకాంత్‌ను మరోసారి మాస్‌ లుక్‌లో చూపించే ప్రయత్నమీ చిత్రం. స్వాతంత్య్రం ముందు, తర్వాత తరాలకు చెందిన రెండు పాత్రల్లో రజనీకాంత్‌ కనిపిస్తారు'' అంటున్నారు దర్శకుడు.

ఆసక్తికరమైన చర్చ

ఆసక్తికరమైన చర్చ

ఈ సినిమా కథ గురించి ఇటీవల ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. కేరళ, తమిళనాడు రాష్ట్రాల మధ్య కట్టిన ముళ్ల పెరియార్‌ డ్యామ్‌ నేపథ్యంలో తీర్చిదిద్దన కథతో తెరకెక్కుతోందని కోలీవుడ్‌లో ప్రచారం సాగుతోంది.

ఏం చెప్పబోతున్నాడు

ఏం చెప్పబోతున్నాడు

ప్రస్తుతం పెరియార్‌ డ్యామ్‌పై వివాదం నడుస్తోంది. మరి ఈ సినిమాతో రజనీ ఏం చెప్పబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది. ఎ.ఆర్‌.రెహమాన్‌ స్వరాలందిస్తున్నారు.

విడుదల తేదీ

విడుదల తేదీ


రజనీకాంత్ స్వయంగా ఈ చిత్రం విడుదల తేది ప్రకటించి తన అభిమానులను ఆనందంలో ముంచెత్తారు. 'లింగా' రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేశారు రజినికాంత్. ఈ సినిమా దీపావళికి విడుదల అవుతుందని వార్తలు వచ్చినా అవి నిజం కాదని చెప్పారు. తన పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్ 12న ‘లింగా' విడుదల అవుతుందని ప్రకటించారు.

ఆ పాత్రలేంటి

ఆ పాత్రలేంటి

ఈ చిత్రంలో రజనీ దొంగగా, ఇంజినీరు గా ద్విపాత్రలలో కనపించనున్నారు. ఫ్లాష్ బ్యాక్ లో ఇంజినీరు పాత్ర వస్తుందని తెలుస్తోంది.

ఫ్లాష్ బ్యాక్ హైలెట్

ఫ్లాష్ బ్యాక్ హైలెట్

సినిమాకు కీలకంగా ఈ చిత్రంలో ఫ్లాష్ బ్యాక్ ఉండబోతోందని తెలుస్తోంది. దొంగ పాత్రకు, బ్రిటీష్ వారి సమయంలో కనిపించే ఇంజినీరు పాత్రకు ఉన్న లింకేంటి, ఇంజినీరు గా రజనీ ఏం చేసాడు...అది ప్రస్తుత కాలానికి ఎలా ముడిపెట్టారన్నది కీలకం కానుంది.

ఫైట్స్

ఫైట్స్

తన తాజా చిత్రం 'లింగా' కోసం ఓ స్త్టెలిష్‌ ఫైట్‌ను తెరకెక్కిస్తున్నారు. దీని చిత్రీకరణ రామోజీ ఫిల్మ్‌సిటీలో జరుగింది. ఫైట్‌ మాస్టర్‌ లీ ఆధ్వర్యంలో రజనీకాంత్‌, జగపతిబాబుపై పోరాట సన్నివేశాలను షూట్ చేసారు.

నయనతార ఐటం సాంగ్..

నయనతార ఐటం సాంగ్..

సినిమా పాటల చిత్రీకరణ కోసం త్వరలో యూరప్‌ వెళ్లనున్నారు. చిత్రంలో అనుష్క, సోనాక్షి సిన్హా హీరోయిన్స్. జగపతిబాబు ముఖ్య పాత్రలో కనిపిస్తారు. కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. రాక్‌లైన్‌ వెంకటేష్‌ నిర్మాత. ఈ సినిమాలో నయనతార ప్రత్యేక గీతంలో నర్తించనుందని సమాచారం. ఈ చిత్రానికి సంగీతం: ఎ.ఆర్‌.రెహమాన్‌, ఛాయాగ్రహణం: ఆర్‌.రత్నవేలు

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X