ఫిక్స్ : ఫస్ట్ లుక్ వినాయకచవితి రోజే

By Srikanya

హైదరాబాద్ : పెద్ద హీరోల సినిమాలకు ఫస్ట్ లుక్ కోసం అభిమానులు ఎదురుచూస్తూండటం సహజం. తమ అభిమాన హీరోని ఎలా సినిమాలో ప్రెజంట్ చేయబోతున్నారనే దానితో ఈ ఫస్ట్ లుక్ పై అంచనాలు పెంచుకుంటూంటారు. రజనీకాంత్ లాంటి స్టార్ హీరో సినిమాలకు అది మరీను. రజనీకాంత్‌ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'లింగా'. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను వినాయకచవితి సందర్భంగా విడుదల చేయడానికి యూనిట్ ప్రయత్నాలు చేస్తోంది.

అనుష్క, సోనాక్షి సిన్హా హీరోయిన్స్. కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. రాక్‌లైన్‌ వెంకటేష్‌ నిర్మాత. చిత్రీకరణ చివరిదశకొచ్చింది. ''రజనీకాంత్‌ను మరోసారి మాస్‌ లుక్‌లో చూపించే ప్రయత్నమీ చిత్రం. స్వాతంత్య్రం ముందు, తర్వాత తరాలకు చెందిన రెండు పాత్రల్లో రజనీకాంత్‌ కనిపిస్తారు'' అంటున్నారు దర్శకుడు.

ఇక ఈ సినిమా కథ గురించి ఇటీవల ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. కేరళ, తమిళనాడు రాష్ట్రాల మధ్య కట్టిన ముళ్ల పెరియార్‌ డ్యామ్‌ నేపథ్యంలో తీర్చిదిద్దన కథతో తెరకెక్కుతోందని కోలీవుడ్‌లో ప్రచారం సాగుతోంది. పెరియార్‌ డ్యామ్‌పై వివాదం నడుస్తోంది. మరి ఈ సినిమాతో రజనీ ఏం చెప్పబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది. ఎ.ఆర్‌.రెహమాన్‌ స్వరాలందిస్తున్నారు.

Rajani's Lingaa first look will be out soon

అంతేకాకుండా రజనీకాంత్ స్వయంగా ఈ చిత్రం విడుదల తేది ప్రకటించి తన అభిమానులను ఆనందంలో ముంచెత్తారు. 'లింగా' రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేశారు రజినికాంత్. ఈ సినిమా దీపావళికి విడుదల అవుతుందని వార్తలు వచ్చినా అవి నిజం కాదని చెప్పారు. బెంగుళూరు లో అక్కడ మీడియాతో మాట్లాడిన రజినీకాంత్.. తన పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్ 12న 'లింగా' విడుదల అవుతుందని ప్రకటించారు. ఈ చిత్రంలో రజనీ దొంగగా, ఇంజినీరు గా ద్విపాత్రలలో కనపించనున్నారు.

చిత్రంలో అనుష్క, సోనాక్షి సిన్హా హీరోయిన్స్. జగపతిబాబు ముఖ్య పాత్రలో కనిపిస్తారు. కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. రాక్‌లైన్‌ వెంకటేష్‌ నిర్మాత. ఈ సినిమాలో నయనతార ప్రత్యేక గీతంలో నర్తించనుందని సమాచారం. ఈ చిత్రానికి సంగీతం: ఎ.ఆర్‌.రెహమాన్‌, ఛాయాగ్రహణం: ఆర్‌.రత్నవేలు

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X