twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అప్పుడే... : 'లింగ' సీడీలు పైరసీ పట్టుకున్నారు

    By Srikanya
    |

    వినుకొండటౌన్ : రిలీజయ్యి..నిండా ఇరవై నాలుగు గంటలు కాలేదు. అప్పుడే పైరసీ భూతం మింగేసే ప్రయత్నం చేసింది. రజనీకాంత్ తాజా చిత్రం లింగా నిన్న ప్రపంచవ్యాప్యంగా అట్టహాసంగా విడుదలైంది. పైరసీని అడ్డుకునేందుకు ఎన్ని జాగ్రత్రలు తీసుకున్నా ఈ లోగా ఈ చిత్రం పైరసీ వచ్చి అందరినీ షాక్ కు గురించి చేసింది. గుంటూరు జిల్లాలో పోలీసులు చేసిన మెరుపు దాడిలో లింగా చిత్రానికి సంభందించిన మూడు వేల సీడిలు దొరికాయి.

    Rajani's Lingaa movie piracy CDs seized

    సినిమా విడుదలతోనే సీడీలు కూడా బయటకు రావడం సినీ వర్గాల్లో అలజడి సృష్టించింది. పోలీసులు ఆకస్మికంగా చేసిన దాడిలో లింగా చిత్రానికి సంబంధించి మూడు వేల సీడీలు లభించగా, రెండు వేలకు పైగా గీతాంజలి సీడీలు, ముఫ్పై వేలకు పైగా ఇంగ్లిష్ మరియు తెలుగు సినిమా సీడీలు దొరికాయి. మొత్తంగా నలభై ఎనిమిది వేలకు పైగా సీడీలను పోలీసులు సీజ్ చేశారు.

    పూర్తి వివరాల్లోకి వెళితే... గుంటూరుజిల్లా వినుకొండ కేంద్రంగా కొత్తసినిమాల పైరసీ సీడీలను తయారు చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా విక్రయిస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. రెండు గృహాల్లో ఆధు నాతన సాంకేతిక పరికరాలతో సినిమా రిలీజ్‌ అయిన రోజునే సీడీలను తయారుచేసి ఇతర జిల్లాలకు సరఫరా చేస్తూ భారీగా సొమ్ము చేసుకుంటున్నారు.

    Rajani's Lingaa movie piracy CDs seized

    పోలీసులు శుక్రవారం మెరుపుదాడులు జరిపారు. ఈ దాడుల్లో దాదాపు 40 వేల పైరసీ సీడీలు, 22 మానిటరింగ్‌ సీపీయూలు పట్టుపడ్డాయి. పట్టుపడ్డ సీడీల్లో శుక్రవారం విడుదలైన రజనీకాంత్‌ హీరోగా నటించిన లింగా సినిమాకు సంబంధించిన 3 వేల సీడీలు ఉన్నట్టు గుర్తించారు. ఈ సందర్భంగా వినుకొండకు చెందిన కొలిశెట్టి వెంకటరామాంజనేయులును అదుపులోకి తీసుకొన్నారు.

    English summary
    Rajinikanth and Sonakshi Sinha, Anushka Shetty's Lingga pirated CDs are sezied on it's release in Vinukonda town on Friday by CCS police.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X