twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కన్నీటి ఎఫెక్ట్ : బాబుకి రజనీకాంత్, సోనూసూద్ ఫోన్లు..అసలేమైందని ఆరా.. కలుస్తానంటూ!

    |

    గత రెండు రోజుల నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో చంద్రబాబు మీడియా సమావేశంలో కంటతడి పెట్టిన ఘటన చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబు లాంటి సీనియర్ నేత పబ్లిక్ లైఫ్ లో మొట్టమొదటిసారి కన్నీళ్లు పెట్టుకున్న నేపథ్యంలో సినీ ప్రముఖులు ఇతర రాజకీయ ప్రముఖులు కూడా ఆయనకు తమ సంఘీభావం వ్యక్తం చేస్తున్నారు. తాజాగాఅందుతున్న సమాచారం మేరకు చంద్రబాబు కి సూపర్ స్టార్ రజినీకాంత్ ఫోన్ చేసినట్లు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే

    Recommended Video

    Chandrababu Issue : Sonu Sood, Rajinikanth ఫోన్ | NTR పై విమర్శలు!! || Filmibeat Telugu
    2014 ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా

    2014 ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా

    ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు.. ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన రాష్ట్ర విభజన తర్వాత పూర్తిగా ఆంధ్రప్రదేశ్ మీద దృష్టి పెట్టి 2014 ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు.. అయితే 2019 ఎన్నికల్లో అనూహ్యంగా అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ 151 సీట్లు సాధించి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు.

    శపథం చేశారు

    శపథం చేశారు


    అయితే జగన్ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి చంద్రబాబు మాత్రం ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్నారు. అయితే చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పటి నుంచి అధికార పార్టీకి చెందిన కొంతమంది సభ్యులు విచ్చలవిడిగా బూతులు మాట్లాడుతూ మీడియాలో హైలెట్ అవుతున్నారు. రెండు రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా చంద్రబాబు తన భార్యను అధికార వైసీపీ సభ్యులు అవమానించారని చెబుతూ ఇకమీదట అసెంబ్లీకి వస్తే ముఖ్యమంత్రి హోదాలో వస్తానని అప్పటి వరకు అసెంబ్లీలో అడుగుపెట్టారు అంటూ ఆయన శపథం చేశారు.

    ఎంతవరకు సమంజస

    ఎంతవరకు సమంజస

    దీనిపై టీడీపీ, నందమూరి అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిన్న నందమూరి కుటుంబ సభ్యులు బాలకృష్ణ ఆధ్వర్యంలో ప్రెస్‌ మీట్‌ నిర్వహించి వైసీపీ నేతల తీరుపై మండిపడ్డారు. ఆంధ్రులంతా అన్నగా అభిమానించే ఎన్టీఆర్‌ కుమార్తెపై.. అసెంబ్లీలోనే వ్యక్తిగత దూషణలు చేయడం బాధాకరమని, రాజకీయాలతో సంబంధం లేని మహిళ వ్యక్తిత్వ హననానికి పాల్పడటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.

    ఆవేదన

    ఆవేదన

    శనివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నందమూరి స్వాతి కళ్యాణ్‌రామ్‌, నందమూరి జయశంకర కృష్ణ, గారపాటి లోకేశ్వరి, గారపాటి శ్రీనివాస్‌, నందమూరి వసుంధర, నందమూరి సుహాసిని, నందమూరి చైతన్యకృష్ణ, కామినేని సీమంతిని, కంఠమనేని ఉమామహేశ్వరి, శ్రీనివాస ప్రసాద్‌, నందమూరి జయశ్రీ రామకృష్ణ సహా పలువురు ఎన్టీఆర్‌ కుటుంబసభ్యులు మాట్లాడారు. అనంతరం జూనియర్ ఎన్టీఆర్ అయితే వీడియో కూడా విడుదల చేసి ఆవేదన వ్యక్తం చేశారు.

    రజనీకాంత్‌ ఫోన్‌ చేసి

    రజనీకాంత్‌ ఫోన్‌ చేసి


    అయితే తాజాగా చంద్రబాబుకు తమిళ తలైవా సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ ఫోన్‌ చేసి పరామర్శించారు. అసెంబ్లీ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. శాసనసభలో జరిగిన ఘటనలతో మానసికంగా బాధపడుతున్న చంద్ర బాబుని పరామర్శించారు. అనంతరం ఏపీలో ఉన్న పరిస్థితుల గురించి చంద్ర బాబుని అడిగి తెలుసుకున్నారు.

    రాజకీయాలకు స్వస్తి చెప్పి

    రాజకీయాలకు స్వస్తి చెప్పి

    మరోపక్క టీడీపీ అధినేత చంద్రబాబుకు హెల్పింగ్ స్టార్ సోనూ సూద్ కూడా ఫోన్ చేసి మాట్లాడారు. అసెంబ్లీలో జరిగిన ఘటన గురించి ఆయనన మాట్లాడారు. శాసనసభలో జరిగిన ఘటన దురదృష్టకరమన్న సోనూ.. దేవాలయం లాంటి సభలో ఇలాంటి వైఖరి సరికాదన్నారు. హైదరాబాద్ వచ్చినప్పుడు కలుస్తానని చంద్రబాబుకు చెప్పారు.

    English summary
    Rajanikanth called chandrababu naidu amid crying in press meet.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X