పోకిరిని ఆకాశానికెత్తిన రజనీకాంత్
భారతదేశంలోనే కాదు దక్షిణాసియాలోనే అత్యధిక పారితోషికం తీసుకునే సూపర్‌స్టార్ రజనీకాంత్ మహేష్ బాబు సినిమా పోకిరిని చూసి అభినందించారు. పోకిరి సినిమాను చాలా స్టైలిష్ గా తీశారు. మహేష్‌బాబు నటన చాలా నావెల్‌గా ఉంది. పూరీ జగన్నాధ్ టేకింగ్ సూపర్‌గా ఉంది. కమర్షియల్ చిత్రాలకు పోకిరి కొత్త స్టైల్‌ను క్రియేట్ చేసింది అని రజనీకాంత్ అభినందించగా, మహేష్, పూరీ ఆయనకు వినమ్రంగా థ్యాంక్స్ చెప్పుకున్నారు. ప్రస్తుతం ఈ సినిమా తమిళంలో రీమేక్ అవుతోంది. ఈ సినిమాను తెలుగులో ఉన్నది ఉన్నట్టు తీస్తేనే బాగుంటుందని, మార్పులు చేయవద్దని రజనీకాంత్ హీరో విజయ్‌కు, దర్శకుడు ప్రభుదేవాకు సూచించినట్టు తెలుస్తోంది.
గతంలో రజనీకాంత్ పోకిరి రాజా పేరుతో చేసిన తమిళ సినిమా గొప్ప హిట్ అయింది. హీరో కృష్ణ తెలుగులో చేసిన చుట్టాలున్నారు, జాగ్రత్త సినిమాకు అది రీమేక్.


Click it and Unblock the Notifications