For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  'రోబో 2' డ్యామేజ్ కంట్రోల్ మోడ్: కంగారుగా నిర్మాత, దర్శకుడు ప్రకటనలు

  By Srikanya
  |

  చెన్నై: రజనీకాంత్ ఆరోగ్యం బాగోలేదని, ఆయన అమెరికాలో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారని మీడియాలో వార్తలు గుప్పుమన్న సంగతి తెలిసిందే. ఈ వార్తలు ఖచ్చితంగా అభిమానులను కంగారు పెడతాయి. అంతకన్నా ఎక్కువగా ఆయనతో చిత్రాలు చేస్తున్న నిర్మాతలను టెన్షన్ పెడతాయి. ఎందుకంటే ఆ ఎఫెక్ట్ బిజినెస్ మీద పడుతుంది. అందుకే డ్యామేజ్ కంట్రోలు మోడ్ లోకి నిర్మాతలు మారారు.

  'రోబో 2' లో అక్షయ్ గెటప్ లీక్...కాకి లా ఉన్నాడు (ఫొటోలు)

  ఇప్పటికే షూటింగ్ దాదాపు పూర్తి చేసుకున్న కబాలికి ఏ సమస్యా రాదు. కానీ వంద కోట్లుకు పైగా పెట్టుబడి పెడుతూ రూపొందుతున్న రోబో 2 మీద ఇంపాక్ట్ పడుతుంది. హీరో అనారోగ్యంతో చేసే సినిమా ఎలా ఉంటుందో, అసలు అలాంటి పరిస్దితుల్లో ఫైనాన్స్ ఎంతవరకూ ఇవ్వచ్చో వంటి ఎన్నో సమస్యలు వచ్చి పడుతాయి. అందుకేనేమో రోబో 2 నిర్మాత ముందుగా మేలుకుని ఈ విషయమై ఖండన చేసారు.


  నిర్మాత రాజు మహాలింగం 'రజనీకాంత్ ఆరోగ్యంగా ఉన్నారని, ప్రస్తుతం అమెరికాలో కుటుంబ సభ్యులతో కలిసి విశ్రాంతి తీసుకుంటున్నాడని' మీడియాకు తెలియచేశారు. రజనీకాంత్ ఆరోగ్యంపై వస్తున్న రూమర్స్ ఇకనైనా ఆగుతాయని ఆయన భావిస్తున్నట్లు తెలియచేసారు.

  రజనీ 'రోబో-2' క్లైమాక్స్: విశేషాలు, నిజాలు..ఆన్ లొకేషన్ ఫొటోలతో

  అంతేకాదు ఇప్పుడు శంకర్ కూడా తమ చిత్రం రోబో 2 వందరోజులు పూర్తి చేసిందని ప్రకటన చేసారు. రోబో సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కిస్తున్న రోబో2.0 వంద రోజుల షూటింగ్ ను పూర్తి చేసుకుంది.

  ఈ వంద రోజుల్లో రెండు ప్రధాన యాక్షన్ సీన్లతో పాటు క్లైమాక్స్ ను తెరకెక్కించినట్లు దర్శకుడు శంకర్ తెలిపారు. విలన్ గా నటిస్తున్న అక్షయ్ కుమార్ తోను, సూపర్‌స్టార్ రజనీకాంత్‌తోను క్లైమాక్స్ సీన్లు తీసినట్లు చెప్పాడు. ఈ వంద రోజుల ప్రయాణం చక్కగా సాగిందని వివరించారు.

  దాదాపు 50 శాతం సినిమా పూర్తయిందని తన ట్విట్టర్ అకౌంట్ లో ఆయన పేర్కొన్నారు. రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య సైతం తన తండ్రి ఆరోగ్యం బాగానే ఉందంటూ, రూమర్స్ సిల్లీగా ఉన్నాయని చెప్తూ తన తండ్రితో కలిసి నడుస్తున్న ఫొటో ఒకటి ట్విట్ చేసింది.

  స్లైడ్ షోలో మరిన్ని విశేషాలు...

   అప్పటినుంచి...

  అప్పటినుంచి...

  గత ఏడాది డిసెంబర్ 16న ప్రారంభమైన రోబో 2.0 సినిమాను నిర్విరామంగా 100 రోజుల పాటు చిత్రీకరించారు.

  అక్షయ్ అప్పటినుంచీ...

  అక్షయ్ అప్పటినుంచీ...

  కాగా, మార్చి 21న అక్షయ్ రోబో 2.0 టీమ్ తో జాయిన్ అయ్యారు.

  ఏప్రిల్ లో ...

  ఏప్రిల్ లో ...

  హాలీవుడ్ యాక్షన్ ప్రొడ్యుసర్ కెన్నీ బేట్స్ నేతృత్వంలో ఢిల్లీలోని నెహ్రు స్టేడియంలో కొన్ని యాక్షన్ సీన్స్ ను చిత్రీకరించారు.

  కబాలి టు రోబో 2

  కబాలి టు రోబో 2

  ఇటీవల కబాలి చిత్ర షూటింగ్ పూర్తి చేసుకున్న రజనీ ...పూర్తి దృష్టి రోబో 2 పై పెట్టి, ఆ టీంతో కలిసారు.

   మండే ఎండల్లో...

  మండే ఎండల్లో...

  ఢిల్లీలో 45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉన్నా, ఆ ఎండను సైతం లెక్క చేయకుండా ఔట్‌డోర్ షూటింగ్‌లో పాల్గొంటున్నారు రజనీ అండ్ టీం.

  అంతకు మించి

  అంతకు మించి

  ‘బాహుబలి'ని మించిన బడ్జెట్‌తో దర్శకుడు శంకర్‌ ‘రోబో 2'ను తెరకెక్కిస్తున్నారు.

  ఇన్సూరెన్స్..

  ఇన్సూరెన్స్..  400 కోట్లతో తీస్తున్న ‘రోబో 2'ని 350 కోట్లకి ఇన్సూరెన్స్‌ చేయించారట!

  ఇదే తొలిసారి..

  ఇదే తొలిసారి..

  ఇంత భారీ మొత్తాన్ని ఒక సినిమాకు ఖర్చు పెట్టడమే భారతదేశ సినిమా చరిత్రలో మొదటిసారి అనుకుంటే ఇంచుమించు అంత మొత్తాన్ని ఇన్సూరెన్స్‌ చేయడం కూడా మొదటిసారే అంటున్నారు.

  హై టెక్నికల్ వ్యాల్యూస్

  హై టెక్నికల్ వ్యాల్యూస్

  ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో హై టెక్నికల్ వాల్యూస్‌తో తెరకెక్కే ఈ చిత్రంగా ‘రోబో 2.0' ప్రచారం జరుగుతోంది.

  నిజమా..

  నిజమా..

  ఈ నేపధ్యంలో అసలు ఈ చిత్రానికి ఎంత బడ్జెట్ పెడుతున్నారనే విషయం హాట్ టాపిక్ గా మారింది. 350 కోట్ల రూపాయల బడ్జెట్ తో రూపొందుతోందని నిర్మాత లైకా ప్రొడక్షన్స్ వారు ప్రకటించారు. ఇది ఇండియన్ సినిమాలోనే హై బడ్జెట్ ఇది.

  అమీ, రహమాన్

  అమీ, రహమాన్

  లైకా ప్రొడక్షన్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో అమీ జాక్సన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, ఎఆర్ రెహమాన్ సంగీత దర్శకుడిగా పని చేస్తున్నారు.

  English summary
  According to official statement by director Shankar, he shot major part of '2.0' movie in the 100 days of working days that include movie's climax episode, two action stunts on Rajinikanth and movie's villain Bollywood star Akshay Kumar, and some scenes.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X