నాగర్జున భూత్ బంగ్లా75లక్షల సెట్ పై పోలీస్ ఇన్వెస్టిగేషన్...
కింగ్ నాగార్జున హీరోగా ప్రముఖ రచయత, డైనమిక్ డైరెక్టర్ రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ దర్సకత్వం లో తెరకెక్కుతున్న చిత్రం 'రాజన్నా'. ఈ చిత్రం నిజం నవాబు కాలం నాటి రాజకారుల ఆకృత్యాలను నేపద్యంగా చేసుకుని తెరకెక్కుతుంది. తండ్రి దర్శకత్వం లో వస్తున్నా ఈ చిత్రం లోని యాక్షన్ ఎపిసోడ్ లను రాజమౌళి ప్రత్యేకంగా తీర్చిదిద్దుతున్నాడు. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ ఫై నాగార్జున ప్రతిస్థాత్మకంగా నిర్మిస్తున్నారు.
చారిత్రక కధాంశం కావడంతో అప్పటి కాలానికి అనుగుణంగా ఆర్ట్ డైరెక్టర్ రవి పర్యవేక్షణలో వివిధ రకాల సెట్స్ ను నిర్మించారు. ఇటివలే అన్నపూర్ణ స్టుడియోలో వేసిన సెట్ లో సినిమా కొంత బాగాన్ని చిత్రీకరించారు. అలాగే జూబ్లి హిల్స్ రోడ్ నెం 25 లో ఉన్న భూత్ బంగ్లాలో మరొక సెట్ నిర్మించి షూటింగ్ జరుపుతున్నారు. మంగళవారం రాత్రి అనుకోకుండా సంభవించిన అగ్ని ప్రమాదంలో భూత్ బంగ్లా లో వేసిన సెట్ మొత్తం కాలిపోయిందని సమాచారం. దాదాపు 75 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన సెట్ పూర్తిగా నాశనం అయ్యింది అని తెలుస్తుంది. ప్రమాదానికి కారణం కరెంట్ షార్ట్ సర్క్యూట్ అని భావిస్తున్నారు. అయితే మరో కోనం నుండి ఈ ఫైర్ యాక్సిడెంట్ ఎలా జరిగిందని పోలీసులు ఇన్వెస్ట్ గేట్ చేస్తున్నారు...


Click it and Unblock the Notifications











