సీరియస్ ‘రాజన్న’ కాదు...నవ్వుల ఫోజన్న!
టాలీవుడ్ లో ఏ సినిమా వచ్చినా.... కామెడీ స్టార్ బ్రహ్మానందం ఫోటోతో ఆ సినిమా పోస్టర్ మార్పింగ్ చేసి కొందరు ఆకతాయిలు నెట్ లోకి వదులుతున్న విషయం తెలిసిందే. గత కొంతకాలంగా సాగుతున్న ఈ వ్యవహారం నెటిజన్లను తెగ నవ్విస్తోంది. తాజాగా రాజన్న సినిమాకు పోస్టర్ కు పేరడిగా బ్రహ్మీ ఫోటోను తగిలించి 'ఫోజన్న' అంటూ ఫేస్ బుక్ లోకి వదిలారు. ఈ ఫోటోతో సీరియస్ గా సాగే రాజన్న సినిమా కాస్తా.....నవ్వులు పంచే 'ఫోజన్న'గా మారింది.
రాజమౌళి తండ్రి విజయేంద్ర వర్మ రాజన్న సినిమాకు దర్శకత్వం వహించగా, రాజమౌళి ఈ సినిమాలోని కొన్ని యాక్షన్ సన్నివేశాలకు దర్శకత్వం వహించారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన ఒక చారిత్రాత్మక అంశాన్ని బేస్ చేసుకుని రూపొందిన ఈ సినిమా రూపొందించారు. డిసెంబర్ నెలలోనే రాజన్న సినిమా విడుదల కాబోతోంది.


Click it and Unblock the Notifications











