విక్రమార్కుడు, ఛత్రపతి చిత్రాల కంటే వందరెట్లు హైరేంజ్ లో ‘రాజన్న’..?
నాగార్జున ప్రధాన పాత్రలో విజయేంద్ర ప్రసాద్ తెరకెక్కించిన హిస్టారికల్ మూవీ 'రాజన్న". అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై నిర్మితమవుతున్న ఈ చిత్రం ట్రైలర్స్ కు విశేష్ స్పందన లభిస్తోంది. ఈ చిత్రంలో నాగార్జున పాత్ర నిడివి తక్కువగా ఉంటుందని ఈ మధ్య వినిపించిన విషయం తెలిసిందే. ఓ పన్నెండేళ్ళ పాప ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో నాగ్ పాత్ర ఇంటర్వెల్ బ్యాంగ్ కి ముందు ఎంటరవుతుందని తెలస్తోంది.
రాజమౌళి రూపొందించిన విక్రమార్కుడు, ఛత్రపతి చిత్రాల్లో ఇంటర్వెల్ బ్యాంగ్ ఎంత ఎనర్జిటిక్ గా, ఎంత ఎట్రాక్టీవ్ గా వుంటుందో 'రాజన్న" చిత్రంలోని ఇంటర్వెల్ బ్యాంగ్ అంతకు వందరెట్లు హైరేంజ్ లో వుంటుందని తెలుస్తోంది. ఎందుకంటే ఈ చిత్రాలకు దర్శకత్వం వహించిన రాజమౌళి 'రాజన్న" చిత్రంలోని యాక్షన్ సన్నివేశాలను హైరేంజ్ లో తెరకెక్కించాడు కాబట్టి. ఈ హై ఓల్టేజ్ యాక్షన్ సన్నివేశాల్లో నాగార్జున రోమాంచితమైన నటనను ప్రదర్శించాడని సమాచారం. ట్రైలర్స్ తో ఓ రేంజ్ లో సంచలనాలకు తెరలేపిన 'రాజన్న" నాగ్ కెరీర్ లోనే ఓ మరపురాని చిత్రంగా నిలిచిపోనుందని ఇప్పటికే ట్రైలర్స్ చూసిన ఇండస్ట్రీ వర్గాలు చెబుతుండటం విశేషం.


Click it and Unblock the Notifications











