కనిపించకుండానే అదరగొట్టిన రానా.... ‘రాజరథం’ ట్రైలర్
నిరూప్ భండారి, అవంతిక శెట్టి జంటగా నటించిన కన్నడ చిత్రం తెలుగులో 'రాజరథం' పేరుతో విడుదల కాబోతోంది. అనూప్ భండారి దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రాన్ని జాలీ హిట్స్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. జనవరి 25న సినిమా విడుదల కాబోతోంది. 'రాజరథం' అంటే ఓ బస్సు. బస్సు చెట్టూ ఈ సినిమా సాగుతోంది. బస్సు పాత్రకు రానా వాయిస్ ఓవర్ ఇచ్చారు. బుధవారం రాత్రి 8 గంటలకు ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ విడుదలైంది.
రానా వాయిస్ ఓవర్ సూపర్
సినిమాలో అన్నీ దాదాపుగా తెలుగు వారికి పరిచయం లేని ముఖాలే ఉన్నాయి. తాజాగా విడుదలైన ట్రైలర్ రానా వాయిస్ ఓవర్‌తో ఉండటంతో ఇది తెలుగు సినిమా కాదనే ఫీలింగ్ అస్సలు రావడం లేదు. ఆ స్థాయిలో రానా వాయిస్ ఓవర్ డామినేషన్ కనిపించింది.

రానా చెప్పిన డైలాగ్ సూపర్, కనిపించుకుండానే అదరగొట్టాడు
ఈ సినిమాలో బస్సు పాత్రకు వాయిస్ ఓవర్ చెబుతున్న రానా.... సినిమాలోని వివిధ పాత్రలను పరిచయం చేస్తూ, చివర్లో.... ఇది వీరి కథ కాదు, నా కథ అంటూ చెప్పిన డైలాగ్ హైలెట్‌గా ఉంది. ట్రైలర్ కట్ చేసిన తీరు కూడా బావుంది. సినిమాపై ఆసక్తిని పెంచింది.

హద్దులు చెరిపేసే కథ: రానా
ఈ సినిమా గురించి రానా మాట్లాడుతూ నా దృష్టిలో హద్దులను చేరిపేసే కథలు కొన్ని ఉంటాయి. అటువంటి వాటిలో 'రాజరథం' ఒకటి. అటువంటి సినిమాలను ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారు. నేను కూడా అలాంటి సినిమాలనే చూడటానికి ఇష్టపడతాను. 'రాజరథం' తెలుగులో పెద్ద సక్సెస్ సాధిస్తుందనే నమ్మకం ఉందన్నారు.
Recommended Video


తెర వెనక, తారాగణం
రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న 'రాజరథం' చిత్రంలో నిరూప్ భండారి, అవంతిక శెట్టి, పి.రవిశంకర్ ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి మాటలు: అబ్బూరి రవి, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్: అజనీష్ లోక్‌నాథ్, ఎడిటింగ్: శాంతకుమార్, సినిమాటోగ్రఫీ: విలియమ్ డేవిడ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సుధాకర్ సాజ, నిర్మాణం: జాలీహిట్స్ టీమ్, అంజు వల్లభనేని, విషు దకప్పదారి, సతీష్ శాస్త్రి, అజయ్‌రెడ్డి గొల్లపల్లి, సంగీతం, స్క్రీన్‌ప్లే, రచన, దర్శకత్వం: అనూప్ భండారి.


Click it and Unblock the Notifications











