Don't Miss!
- Finance Kotak Mahindra Bank: కొంపముంచి కోటక్ మహీంద్రా బ్యాంక్.. భారీగా పడిపోయిన స్టాక్..!
- Technology ఆపిల్ తరహా డిజైన్‌తో నాయిస్ స్మార్ట్‌వాచ్.. 1.85 అంగుళాల డిస్ప్లే, 7 రోజుల బ్యాటరీ లైఫ్‌తో విడుదల
- News వీళ్లా..వైఎస్ వారసులు, పక్కన పెట్టింది ఇందుకే - షర్మిల పై జగన్ ఫైర్..!!
- Lifestyle ప్రపంచంలోనే అత్యంత పోషకమైన వేచూర్ ఆవు పాలు: గిన్నీస్ రికార్డ్ సాధించిన ఈ ఆవు గురించి ఆసక్తికరమైన విషయాలు
- Sports RCBకి గుడ్ న్యూస్: ప్లే ఆఫ్స్‌కు ఇలా ఈజీగా చేరొచ్చు!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
హీరో రాజశేఖర్‌కి హార్ట్ ఎటాక్,స్టంట్ కూడా వేసారు ? చిరంజీవి ఇంటికి కూడా వెళ్ళాడట
గరుడవేగ సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఫిట్‌గా కనిపించటం కోసం వర్కౌట్లు చేస్తున్న సమయం లో తనకి హార్ట్ ఎటాక్ వచ్చిందనీ, లోపల స్టంత్ కూదా వేసారనీ చెప్పి అందరినీ షాక్ కి గురి చేసాడు సీనియర్ హీరో రాజశేఖర్
చాలాకాలం తర్వాత హీరో రాజశేఖర్ సినిమా ఒకటి ఇంత హైప్ తో రావటం, ఈ రోజు 'పీఎస్వీ గరుడ వేగ' సినిమాతో పలకరించబోతున్నాడు సీనియర్ హీరో. ఈ సినిమా టీజర్, ట్రైలర్ చూసినప్పుడు అందరికీ కనిపించిన విషయం ఒకటుంది, వయసు తాలుకు ప్రభావం రాజశేఖర్లో కొట్టొచ్చినట్టు కనిపించింది, కొన్ని షాట్స్‌లో మరీ డల్లుగా ఉన్నారు. ఈ సినిమా ప్రమోషన్లలో కూడా రాజశేఖర్ కాస్త నలతగానే కనిపిస్తున్నాడు.
హార్ట్ అటాక్ కూడా వచ్చిందీ
అయితే దీనంతటికీ కారణం కొన్ని రోజులకి ముందే రాజశేఖర్ తల్లి మరణం కారణం అనుకున్నారంతా, అయితే తల్లి మరణం కుంగదీసినప్పటికీ మరో కారణం కూడా ఉంది.. ఆయనకు కొన్ని నెలల కిందట హార్ట్ అటాక్ కూడా వచ్చిందట. ఈ విషయాన్ని రాజశేఖరే స్వయంగా వెల్లడించడం అందరినీ షాక్‌కు గురి చేస్తోంది.
Recommended Video
చెస్ట్ పెయిన్ అనిపించి హాస్పిటల్‌కు వెళ్లాను
ఈ సినిమాలో నేను ఎన్ఐఏ ఆఫీసర్ పాత్ర పోషిస్తున్నా. మంచి ఫిట్నెస్తో కనిపించాలని ముందు వర్కౌట్లు చేశాను. షూటింగుకి సరిగ్గా నెల రోజుల ముందు కొన్ని రోజుల పాటు వరుసగా చెస్ట్ పెయిన్ అనిపించి హాస్పిటల్‌కు వెళ్లాను. పరీక్షలు చేసి హార్ట్ ఎటాక్ అని చెప్పారు షాకయ్యాను.
స్టెంట్ వేశారు
తర్వాత స్టెంట్ వేశారు. కనీసం ఆరు నెలలు విశ్రాంతి తీసుకోమన్నారు. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకున్నా కానీ.. డాక్టర్లు చెప్పినన్ని రోజులు రెస్ట్ తీసుకునే వీలు లేకపోయింది. అప్పటికే ఆలస్యం కావడంతో షూటింగ్ మొదలుపెట్టేశాం. ఇంకా విశ్రాంతి రెస్ట్ తీసుకుంటే మిగతా ఆర్టిస్టుల డేట్లకు ఇబ్బంది అవుతుందని షూటింగ్ నాకోసం వాయిదా వేయలేదు.
సినిమా చూడమని ఆహ్వానించా
ఈ విషయమే షాకింగ్ అనుకుంటే రాజశేఖర్.. చిరంజీవి ఇంటికి వెళ్లానని చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తోంది. తన కొత్త సినిమా ‘గరుడవేగ' చూడమంటూ చిరును అడిగినట్లు రాజశేఖర్ వెల్లడించాడు. ‘‘అవును. నేను చిరంజీవి గారి ఇంటికి వెళ్లా. నా సినిమా చూడమని ఆహ్వానించా.
ట్రైలర్ చూశా. బాగుంది
ఆయన అప్పటికే ‘గరుడవేగ' ట్రైలర్ చూశారట. ‘మా ఆఫీసులోనూ నీ సినిమా గురించి మాట్లాడుకొంటున్నారు. నేనూ ట్రైలర్ చూశా. బాగుంది' అని చిరంజీవి గారు మెచ్చుకున్నారు కూడా'' అని రాజశేఖర్ చెప్పాడు.
వెయిట్ చేయాలి
మెగా అభిమానుల్లో తనపై వ్యతిరేకత తగ్గించుకోవడానికి.. వాళ్లను కూడా తన సినిమా వైపు మళ్లించడానికి రాజశేఖర్ ఈ మాట అన్నట్లుంది. మరి నిజంగానే చిరంజీవి ‘గరుడవేగ' చూస్తారేమో వెయిట్ చేయాలి. అదే జరిగితే ‘గరుడవేగ' ప్రచారానికది బాగా ఉపయోగపడుతుందనడంలో సందేహం లేదు.