హీరో రాజశేఖర్, ఆయన భార్య జీవిత తమకు భద్రత కల్పించాల్సిందిగా పోలీసుల్ని ఆశ్రయించారు. ఈ రోజు (శనివారం) ఉదయం వారు హైదరాబాద్ పోలీస్ కమీషనర్ ఎంవి కృష్ణారావును కలిశారు. ఆయనకు అందజేసిన పిటిషన్‌లో తమకు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ప్రాణహాని వున్నదని వారు తెలిపారు. తమపై చిరంజీవి అభిమానులు దాడి చేయడం, ఇటీవల తమ కార్యాలయంలో చోరీ జరగడం వంటి సంఘటనల నేపథ్యంలో తమకు భద్రత కల్పించాలని రాజశేఖర్ దంపతులు కోరారు. దీనికి వెంటనే స్పందించిన కమీషనర్ కృష్ణారావు భద్రతా సిబ్బంది ఖర్చు భరిస్తే భద్రత కల్పించేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపారు. దానికి సరేనన్న రాజశేఖర్ దంపతులు వెంటనే రక్షణను ఏర్పాటు చేయాలని ఆయనను అర్ధించారు.
Story first published: Friday, June 26, 2026, 16:38 [IST]