చిరుపై రాజశేఖర్ డైలాగ్ గొడవ

By Staff

Rajasekhar
రాజశేఖర్ తాజా చిత్రం 'సత్యమేవ జయతే' లో చిరంజీవిని లక్ష్యంగా చేసుకుని చెప్పిన కొన్ని డైలాగ్ లు ఇప్పుడు మెగాస్టార్ అభిమానుల ఆగ్రహాన్ని చవి చూస్తున్నాయి. 'మథర్ థెరిస్సా ఫోటో పెట్టుకున్నంత మాత్రాన గొప్పవారు కాలేరు' అని రాజశేఖర్ చెప్పిన ఒక డైలాగ్ సూటిగా,స్పష్టంగా చిరంజీవిని ఉద్దేశించిందే అంటూ చిరంజీవి అభిమానులు ఆగ్రహిస్తున్నారు.రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలలో ఈ చిత్రం ప్రదర్శిస్తున్న థియేటర్ల వద్ద చిరంజీవి అభిమానులు, ప్రజారాజ్యం పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.

ఈ డైలాగ్ ను వెంటన చిత్రం నుంచి తొలగించాలంటూ వారు డిమాండ్ చేశారు. ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకపోయినప్పటికీ చిరంజీవి, రాజశేఖర్ మధ్య మరో కొత్త వివాదానికి ఈ డైలాగ్ తెర తీస్తుందేమోనన్న అనుమానాలు సినీ పరిశ్రమ వర్గాలలో వ్యక్తం అయింది.'సత్యమేవ జయతే' చిత్రం ప్రదర్శిస్తున్న థియేటర్ల వద్ద జరుగుతున్న ఆందోళన గురించి వార్తలు వెలువడిన వెంటనే దీనిపై ఛానెల్స్ వారు చర్చాగోష్టిలు నిర్వహించారు. ఈ వివాదంపై రాజశేఖర్ తో వారు మాట్లాడించారు. దాంతో ఓ చానల్ లో రాజశేఖర్ మాట్లాడుతూ, ఈ డైలాగ్ ఎంతమాత్రం చిరంజీవిని ఉద్దేశించి పెట్టింది కాదని స్పష్టం చేశారు. అలా అంటూనే ఒకరి పేరు చెప్పుకుని ప్రజలలోకి వెళ్ళడం సబబు కాదని చిరంజీవిపై పరోక్షంగా మరోసారి వ్యంగ్య బాణం విసిరారు.

ఇక మథర్ థెరిస్సా ఆదర్శంతోనే తాను ప్రజా సేవలోకి అడుగుపెడుతున్నట్లుగా ప్రజారాజ్యం పార్టీ స్థాపన సమయంలో చిరంజీవి ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రజారాజ్యం కార్యాలయంలో సైతం 'మథర్' చిత్రం ప్రముఖంగా కనిపిస్తుంటుంది.అలాగే ఈ చిత్రానికి రాజశేఖర్ సతీమణి జీవిత స్వయంగా దర్శకత్వ బాధ్యతలు నిర్వహించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X