చిరుపై చల్లారని రాజశేఖర్

పోలీసుల దర్యాప్తులో ఆ ఎస్ఎంఎస్ సూర్యాపేట ప్రాంతం నుంచి వచ్చినట్లు తేలింది. వెంటనే అక్కడి పోలీసులకు సమాచారం అందించడంతో వారు ఆ సెల్‌ఫోన్ ఆధారంగా ఒక యువకుణ్ణి అదుపులోకి తీసుకున్నారు. అతను చిరంజీవి వీరాభమాని. దాంతో అతణ్ణి అరెష్టు చేసి హైదరాబాద్‌కు తీసుకు వస్తున్నారు. ఎందుకిలా చేసావని సూర్యాపేట పోలీసులు అతన్ని వారి భాషలో అడిగితే ఆ కుర్రాడు కంగారు పడ్డాడు. ఆ ఎస్ఎంఎస్‌ను సరదాగా తన ఫ్రెండ్ కి పంపాననీ, అయితే నెంబర్ పొరబాటుగా నొక్కడంతో అది రాజశేఖర్‌కు వెళ్లి వుండవచ్చుననీ అంటున్నాడు.
తాను ఉద్దేశ పూర్వకంగా చేసింది కాదనీ మొత్తుకుంటున్నాడట. ఈ గొడవ ఎలా ఉన్నా చిరంజీవి రెపో మాపో పార్టీ పెడతారని ఆశిస్తున్న ఈ పరిస్ధితుల్లో మళ్ళీ అభిమానుల అత్యుత్సాహం వల్ల ఈ తరహా సంఘటనలు జరిగి నెగిటివ్ ఇంప్రెషన్ పడే అవకాశం ఉంటుందంటున్నారు పరిశీలకులు.


Click it and Unblock the Notifications











