»   » పవన్ కళ్యాణ్ సాంగుకు హీరో రాజశేఖర్ డాన్స్

పవన్ కళ్యాణ్ సాంగుకు హీరో రాజశేఖర్ డాన్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగా ప్యామిలీతో రాజశేఖర్, జీవిత దంపతులకు చాలా కాలంగా రిలేషన్ షిప్ బాగోలేదనే విషయం అందరికీ తెలిసిన విషయం. గతంలో పలు సందర్భాల్లో చిరంజీవిపై, పవన్ కళ్యాణ్ మీద జీవిత, రాజశేఖర్ దంపతులు విమర్శలు సైతం చేసారు. అయితే కాల కాలక్రమేనా ఇరు వర్గాలు కూల్ అయ్యాయి.

గతంలో జీవిత రాజశేఖర్ దంపతులు పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేయడం, పవన్ కళ్యాణ్ కూడా తన మూవీ ‘గబ్బర్ సింగ్'లో రాజశేఖర్ ను ఇమిటేట్ చేసూ సెటైరికల్ సన్నివేశాలు పెట్టడం అప్పట్లో హాట్ టాపిక్.

Rajasekhar Dances To Pawan's Songs

ఆ సంగతి పక్కన పెడితే యూఎస్ఏలోని న్యూజెర్సీలో తెలుగు కళా సమితి ఆధ్వర్యంలో జరిగిన దీపావళి వేడుకలకు ఇన్విటేషన్ అందడంతో రాజశేఖర్, జీవిత దంపతులు తమ ఇద్దరు పిల్లలతో కలిసి వెళ్లారు. ఈ వేడుకల్లో పాల్గొనడంతో పాటు స్టేజీపై డాన్స్ కూడా చేసారు. పవన్ కళ్యాణ్ సినిమాల్లోని పాటలకు కూడా ఆయన డాన్స్ చేయడం గమనార్హం. ఈ వేడుకల్లో రాజశేఖర్ కూతుర్లు శివానీ, శివాత్మిక కూడా పాల్గొన్నారు.

రాజశేఖర్ సినిమాల విషయానికొస్తే... 53 సంవత్సరాల రాజశేఖర్ ఇంకా సోలో హీరో పాత్రలు చేయడానికే మొగ్గు చూపుతున్నాడు. వరుస పరాజయాలు ఎదురైనా రాజశేఖర్ తన ప్రయత్నం మాత్రం ఆపడం లేదు. ఇటీవల ఆయన నటించిన గడ్డం గ్యాంగ్ నష్టాలనే మిగిల్చింది.

English summary
Rajasekhar and Jeevitha were invited for the Diwali celebrations in New Jersey, USA. Rajasekhar participated in the event enthusiastically and even enthralled everyone as he danced to some of the hit numbers from Powerstar Pawan Kalyan's films.
Please Wait while comments are loading...