»   » స్టార్ల మధ్య రాజశేఖర్ కూతురు పార్టీ, కారణం అదేనా? (ఫోటోస్)

స్టార్ల మధ్య రాజశేఖర్ కూతురు పార్టీ, కారణం అదేనా? (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రాజశేఖర్, జీవిత దంపతులకు ఇద్దరు కూతుర్లు ఉన్న సంగతి తెలసిందే. పెద్ద కూతురు పేరు శివాని, చిన్న కూతురు పేరు శివాత్మికి. ఈ అమ్మాయిలు తరచూ తమ తల్లిదండ్రులతో కలిసి వివిధ సినిమా ఫంక్షన్లలో కనిపిస్తూనే ఉంటారు. ఇటీవల రాజశేఖర్ చిన్న కూతురు శివాత్మిక 16వ సంవత్సరంలో అడుగు పెడుతున్న వేళ బర్త్ పార్టీ పలువురు టాలీవుడ్ స్టార్ల మధ్య గ్రాండ్‍‌గా జరిగింది.

టి. సుబ్బారామిరెడ్డితో పాటు టాలీవుడ్ స్టార్లు రవితేజ, మంచు విష్ణు, రాజ్ తరుణ్, పరుచూరి బ్రదర్స్, సాయికుమార్, బెల్లంకొండ శ్రీనివాస్, జయసుధ, సత్యం రాజేష్ తో పాటు పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు. గతంలో ఎన్నడూ లేని విధంగా శివాత్మక పుట్టినరోజు వేడుక గ్రాండ్ గా నిర్వహించారు.

త్వరలో రాజశేఖర్ కూతురు హీరోయిన్ గా తెరంగ్రేటం చేయబోతుందనే వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బర్త్ డే పార్టీ గ్రాండ్ గా నిర్వహించడం చర్చనీయాంశం అయింది. ఆ కారణంగానే పార్టీ ఇంత గ్రాండ్ గా నిర్వహించారని అంటున్నారు.

ఆ సంగతి పక్కన పెడితే... ప్రత్యేకంగా డిజైన్ చేసిన డ్రెస్సులో శివాత్మిక ఎంతో బ్యూటిఫుల్ గా కనిపించింది. శివాత్మిక లుక్ చూసిన పలువురు స్టార్లు హీరోయిన్ గా బాగా సెట్టవుతుందని రాజశేఖర్ జీవిత దంపతులకు సూచించినట్లు సమాచారం. స్లైడ్ షోలో ఫోటోస్....

టీఎస్ఆర్, రవితేజ

టీఎస్ఆర్, రవితేజ


శివాత్మిక బర్త్ డే పార్టీలో టి.సుబ్బిరామిరెడ్డి, రవితేజ

స్టార్లతో..

స్టార్లతో..


టాలీవుడ్ స్టార్లు రవితేజ, మంచు విష్ణు, రాజ్ తరుణ్ లతో కలిసి..

డాటర్స్..

డాటర్స్..


రాజశేఖర్, జీవిత దంపతుల ముద్దుల కూతుర్లు శివాని, శివాత్మిక.

వావ్ బ్యూటిఫుల్

వావ్ బ్యూటిఫుల్


బర్త్ డే పార్టీలో శివాత్మిక లుక్ చూసిన వారంతా వావ్... బ్యూటిఫుల్ అంటూ కితాబిచ్చేసారట.

జయసుధ

జయసుధ


శివాత్మిక బర్త్ డే పార్టీలో నటి జయసుధ, రవితేజ

విష్ణు, రాజ్ తరుణ్

విష్ణు, రాజ్ తరుణ్


మంచు విష్ణు, రాజ్ తరుణ్ లతో కలిసి శివాత్మిక.

స్వీట్ సిక్స్‌టీన్

స్వీట్ సిక్స్‌టీన్


శివాత్మిక 16వ ఏట అడుగు పెడుతున్న వేళ స్వీట్ సిక్స్‌టీన్ పేరుతో ఈ బర్త్ డే బాష్ నిర్వహించారు.

English summary
Actor Rajasekhar’s younger daughter Sivatmika celebrated her 16th birthday recently.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu