TRENDING ON ONEINDIA
-
మంత్రి ఆదికి షాక్: జమ్మలమడుగు అభ్యర్ధిని తేల్చేసారు
-
మీ పాత కారుని కొత్తగా మార్చటం ఎలా.?
-
రూ.4999కే led hd smart tv, ఎలా సొంతం చేసుకోవాలో తెలుసుకోండి
-
వాళ్లంతా మహానుభావులు.. అమ్మాయిల క్లీవేజ్, తొడలు చూసేస్తారు.. నాగబాబు ఘాటు వ్యాఖ్యలు!
-
కోబ్రా దెబ్బకు షారుఖ్ కంపెనీ గింగిరాలు?
-
చీర కట్టుకోవడాన్ని అమితంగా ఇష్టపడుతారా ? ప్రయాణాలకు ఈ చీరలు
చిరంజీవి, మోహన్ బాబు, రాజశేఖర్ న్యూఇయర్ పార్టీ (ఫోటోస్)
టాలీవుడ్ స్టార్స్ చిరంజీవి, మోహన్ బాబు, రాజశేఖర్ ముందు నుండి ఇండస్ట్రీలో భిన్న ధృవాలుగానే ఉంటూ వచ్చారు. ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలో వీరి మధ్య మంచి స్నేహమే ఉండేది. అయితే కాలక్రమంలో కొన్ని పరిస్థితులు వీరి మధ్య విబేధాలకు కారణమైంది. అయితే విబేధాలు ఎల్లకాలం ఉండవు అనేది జగమెరిగిన సత్యం. చాలా రోజుల క్రితమే వీరి మధ్య సత్సబంధాలు నెలకొన్నాయి. తాజాగా ఈ ముగ్గురూ కలిసి ఇటీవల న్యూఇయర్ పార్టీలో సందడి చేశారు.
మిలియన్ డాలర్ మూమెంట్ అంటున్న ఫ్యాన్స్
ఈ ముగ్గురినీ ఇప్పటి వరకు ఒకే ఫ్రేములో చూడలేదని, ఇలా ముగ్గురినీ ఒకే చోట చూడటం ఆనందంగా ఉందని అభిమానులు అంటున్నారు. వీరికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
పార్క్ హయత్ హోటల్‌లో పార్టీ
పార్క్ హయత్ హోటల్‌లో ఇటీవల కళాబంధు టి సుబ్బిరామిరెడ్డి న్యూ ఇయర్ సంబరాలు నిర్వహించారు. ఈ వేడుకకు చిరంజీవి, మోహన్ బాబు, రాజశేఖర్ లతో పాటు పలువురు సినీ ప్రముఖులను ఆహ్వానించారు.
రాజశేఖర్ ఫ్యామిలీ
న్యూఇయర్ పార్టీలో రాజశేఖర్ ఫ్యామిలీ మొత్తం పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మెగాస్టార్ చిరంజీవితో ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.
హాజరైన నాగబాబు
టి సుబ్బిరామిరెడ్డి నిర్వహించిన న్యూ ఇయర్ వేడుకల్లో అన్నయ్య చిరంజీవితో పాటు మెగా బ్రదర్ నాగబాబు కూడా పాల్గొన్నారు.
అశ్వినీ దత్ ఇంకా ప్రముఖులు
ఈ న్యూఇయర్ పార్టీలో ప్రముఖ తెలుగు సినిమా ప్రముఖులు పాల్గొన్నారు.
గరుడ వేగకు మెగా సపోర్ట్
ఇటీవల విడుదలైన రాజశేఖర్ ‘గరుడ వేగ' చిత్రానికి చిరంజీవి తన మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే.
మిత్రులు-శ్రతువులు-మిత్రులు
గతంలో చిరంజీవితో మోహన్ బాబుకు, రాజశేఖర్‌కు కొన్ని విబేధాలు నెలకొన్నాయన్నది జగమెరిగన సత్యం. పలు వేడుకల్లో మోహన్ బాబు స్వయంగా చిరంజీవిపై కామెంట్స్ చేశారు. రాజశేఖర్ గతంలో ప్రెస్ మీట్లు పెట్టిమరీ చిరంజీవిపై విమర్శలు చేశారు. అయితే పాత విషయాలన్నీ మరిచిపోయి ఇపుడు ముగ్గురూ మంచి స్నేహితుల్లా మెలుగుతున్నారు.