twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రమాణ స్వీకారం రోజే.. ‘మా’ ప్రెసిడెంట్ నరేష్‌కు ఝలక్ ఇచ్చిన హీరో రాజశేఖర్!

    |

    మావీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు శివాజీ రాజా ఇటీవల ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి కొత్తగా 'మా' అధ్యక్షుడిగా ఎన్నికైన నరేష్ గురించి కొన్ని విషయాల్లో విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఎన్నికల ముందు సభ్యులకు మందుకొట్టించినట్లు ఆరోపించారు. ''ఇది జరుగలేదని డాక్టర్ రాజశేఖక్ మాత్రమే చెప్పాలి. ఆయన మాట మాత్రమే నేను నమ్ముతాను. లోపల ఏమీ లేకుండా ఉన్నది ఉన్నట్లు చెప్పేది ఆయన మాత్రమే... ఇక నుంచి జీవితకు, నరేష్‌కు రాజశేఖర్‌ను కంట్రోల్ చేయడానికే సరిపోతుంది.'' అన్నారు. తాజాగా శుక్రవారం జరిగిన 'మా’ కొత్త కమిటీ ప్రమాణ స్వీకారోత్సవంలో చోటు చేసుకున్న పరిణామాలు చూస్తుంటే శివాజీ రాజా చెప్పింది నిజమే అనిపిస్తోంది.

    ప్రమాణ స్వీకారోత్సవం రోజే నరేష్‌కు ఝలక్ ఇచ్చిన రాజశేఖర్

    ప్రమాణ స్వీకారోత్సవం రోజే నరేష్‌కు ఝలక్ ఇచ్చిన రాజశేఖర్

    ‘మా' కొత్త అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం నరేష్ ప్రసంగిస్తూ... ప్రతి విషయంలో నేను, నేను అని వ్యాఖ్యానిస్తూ వచ్చారు. దీంతో రాజశేఖర్‌కు కోపం వచ్చింది. అక్కడికక్కడే మైక్ అందుకుని అలా మాట్లాడటం సరికాదు అంటూ నరేష్‌కు ఝలక్ ఇచ్చారు.

    నరేష్ అలా మాట్లాడి ఉండకూడదు

    నరేష్ అలా మాట్లాడి ఉండకూడదు

    ‘‘నరేష్‌గారు నేను, నేను అనే మాట వాడి ఉండకూడదు. మేము అని మాట్లాడాల్సింది. నరేష్ వచ్చి స్వయంగా అడగటం వల్లే నేను ‘మా' ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంటుగా పోటీ చేశాను. ఇప్పటి వరకు అందరం కలిసే అన్నీ చేశాం. ఆయన మేము, మా ప్యానల్ కలిసి చేస్తామని చెప్పాల్సింది. ఈ విషయాన్ని ఆయన కరెక్షన్ చేసుకోవాలి.'' అంటూ రాజశేఖర్ సభా ముఖంగా చెప్పడంతో నరేష్ ఏం మాట్లాడాలో తెలియక బిత్తరపోయారు.

    నరేష్ నా ఫ్రెండే, కానీ నేను ఇలానే మాట్లాడతా..

    నరేష్ నా ఫ్రెండే, కానీ నేను ఇలానే మాట్లాడతా..

    నరేష్ నా ఫ్రెండే, కానీ ఏదైనా తప్పు చేస్తే ఇలానే మాట్లాడతా. అది నా నైజం. మేమంతా కలిసే ఉన్నాం, కలిసి పని చేస్తాం. ‘మా'లో ఎవరూ ఏమీ చేయడం లేదు నా వంతుగా ఏదో ఒకటి చేయాలని వచ్చాను. మొదట జీవితను మాత్రమే కంటెస్ట్ చేయిద్దామనుకున్నాను. పదవి లేకుండా నేను ఇక్కడ ఏమైనా మంచి చేయడానికి అవకావం ఉండదు కాబట్టే పోటీ చేశాను అని... రాజశేఖర్ చెప్పుకొచ్చారు.

    కవర్ చేసిన జీవిత

    కవర్ చేసిన జీవిత

    రాజశేఖర్ మాట్లాడిన వెంటనే మైక్ అందుకున్న జీవిత... ‘‘అతడి మాటలను కవర్ చేసే ప్రయత్నం చేశారు. ఈ ఫంక్షన్ ఆర్గనైజ్ చేసే క్రమంలో నరేష్ ఏదో మరిచిపోయి అలా మాట్లాడారు. మా మధ్య ఎలాంటి విబేధాలు ఏమీ లేవు.'' అన్నారు.

    వచ్చి దెబ్బలాడి పని చేయండి

    వచ్చి దెబ్బలాడి పని చేయండి

    సభ్యులు ఏ ఫంక్షన్ జరిగినా నన్ను పిలవలేదు అనే విషయాన్ని మనసులో పెట్టుకోవద్దు. కొంత మంది మిస్సయినా కూడా నేను ఎందుకు మిస్సయ్యానని వచ్చి దెబ్బలాడి పని చేయండి. అందరం కలిసి పని చేద్దాం. అందరూ ఆశ్చర్య పడేలా, మనపై వచ్చిన ఆరోపణలు వెనక్కి తీసుకునేలా, ‘మా' గౌరవాన్ని నిలబెట్టేలా పని చేద్దామని జీవిత సూచించారు.

    English summary
    Rajasekhar Fires On Naresh Behavior at MAA New Executive Committee Oath Taking Ceremony.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X