For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మహంకాళి షూటింగులో గాయపడిన రాజశేఖర్ కోలుకుంటున్నారు

    By Pratap
    |

    మహంకాళి సినిమా షూటింగులో గాయపడిన హీరో రాజశేఖర్ కోలుకుంటున్నారు. చెన్నైలో మహంకాళి షూటింగులో రాజశేఖర్ గాయపడిన విషయం తెలిసిందే. కొద్ది రోజుల క్రితం గాయపడిన రాజశేఖర్‌ను వెంటనే చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేర్చారు. తర్వాత ఆయన చెన్నైలోని తమ ఇంటికి మారారు. వైద్యుల సలహా మేరకు జాగ్రత్తలు తీసుకుంటున్నారని రాజశేఖర్ భార్య జీవిత చెప్పారు. ఎడమ మోకాలికి శస్త్రచికిత్స జరిగింది. కుడి చేయి మణికట్టుకు కూడా గాయాలయ్యాయి. దీనికి శస్త్ర చికిత్స అవసరం కావచ్చునని భావిస్తున్నారు.

    కుడి చేయి మణికట్టుకు ఆపరేషన్ అవసరమైతే హైదరాబాదులో చేయించుకోవాలని రాజశేఖర్ భావిస్తున్నారు. ఆయన శుక్రవారమే హైదరాబాదుకు చేరుకున్నారు. మామూలు స్థితికి చేరుకోవడానికి రాజశేఖర్‌కు నాలుగైదు వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు చెప్పారు.

    English summary
    It is aware of it Dr Rajasekhar, movie actor, got hurts in 'mahankali' (telugu, tamil movie)shooting in chennai few days back and he was immediately rushed to apollo hospital for a treatment. Now he is shifted to home in chennai on wednesday.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X