For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఆమెతో అక్రమ సంబంధం లేదు.. అలా అని నేను రాముడిని కాదు.. రాజశేఖర్

  By Rajababu
  |

  యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ మళ్లీ సక్సెస్ బాట పట్టారు. గరుడవేగతో మంచి విజయాన్ని సొంతం చేసుకొన్నారు. చాలా రోజుల గ్యాప్ తర్వాత మళ్లీ సిల్వర్ స్క్రీన్‌పై మళ్లీ పవర్ చూపించాడు. ఈ మధ్యకాలంలో ఆయనను అనేక విషాదాలు చుట్టుముట్టాయి. ఇలాంటి పరిస్థితులు నేపథ్యంలో రాజశేఖర్ ఓ యూట్యూబ్ ఛానెల్‌తో మాట్లాడారు. రాజశేఖర్ చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే..

   భావోద్వేగాల మధ్య

  భావోద్వేగాల మధ్య

  ప్రస్తుతం నేను భావోద్వేగాల మధ్య కొట్టుమిట్టాడుతున్నాను. ఓ పక్క నా తల్లి మరణం.. మరో పక్క జీవిత సోదరుడి మృతి మానసికంగా నన్ను, నా ఫ్యామిలీని కుంగదీసాయి. ఓ దశలో డిప్రెషన్‌కు గురయ్యే ప్రమాదం ఎదురైంది.

   డిప్రెషన్‌కు దూరమయ్యా..

  డిప్రెషన్‌కు దూరమయ్యా..

  గురుడ వేగ సక్సెస్ కావడం, రిలీజ్‌కు ముందు సినిమా రిలీజ్ పనుల్లో బిజీగా ఉండటం వల్ల డిప్రెషన్‌కు దూరమయ్యాను. ఎక్కువగా రాత్రి పూట ఈ విషయాలు వెంటాడుతుంటాయి. కానీ గరుడవేగ సక్సెస్ కార్యక్రమాల్లో ఉండటం వల్ల ఆ బాధను మరచిపోయాను.

   తల్లితో అనుబంధం..

  తల్లితో అనుబంధం..

  నా తల్లితో నాకు చాలా గొప్ప అనుబంధం ఉంది. ప్రతీ విషయాన్ని అమ్మతో పంచుకొనే వాడిని. జీవితతో పెళ్లికి ముందు మరో అమ్మాయితో అఫైర్ గురించి అమ్మకు చెప్పుకొనే వాడిని. మా మదర్ అమ్మగా కంటే ఫ్రెండ్‌లా ఉండేది.

   తల్లిని కాపాడుకోలేకపోయా

  తల్లిని కాపాడుకోలేకపోయా

  డాక్టర్ అయి ఉండి నేను నా తల్లిని కాపాడుకోలేకపోవడం నాకు బాధ కలిగించింది. ఐదు నిమిషాల ఆలస్యం నా తల్లి మరణానికి కారణమైంది. నా తల్లి ఫొటోను చూసిన ప్రతీసారి.. ఏరా నా నన్ను ఎందుకు కాపాడాలేకపోయావురా.. నన్ను బతికించాల్సి ఉండేది అని నా తల్లి నాతో అన్నట్టు ఫీలింగ్ కలుగుతుంది. ఎంతో మందిని కాపాడిన నేను నా తల్లిని రక్షించుకోలేకపోయాను.

   నా తల్లి మనస్తాపానికి

  నా తల్లి మనస్తాపానికి

  జీవితతో పెళ్లి తర్వాత నా తల్లి కొంత మనస్తాపానికి గురైంది. జీవిత వచ్చి మా కుటుంబాన్ని వేరు చేసింది అనే ఫీలింగ్ నా తల్లికి ఉండేది. కానీ తర్వాత ఆమె రియలైజ్ అయింది. జీవిత ఉంటేనే రాజశేఖర్‌కు అండ అని ఆమె భావించింది. అప్పటి నుంచి జీవితను బాగా చూసుకొన్నది.

   జీవిత డైరెక్షన్ వల్ల కాదు..

  జీవిత డైరెక్షన్ వల్ల కాదు..

  జీవిత డైరెక్షన్ చేయడం వల్లనే నా సినిమాలు ఫ్లాప్ అయ్యాయని చెప్పడం సరికాదు. జీవిత దర్శకత్వం వహించిన శేషు చిత్రం బ్రహ్మండంగా వచ్చింది. అలాగే ఎవడైతే నాకేంటి చిత్రం కూడా జీవిత బాగా తీసింది. కొన్ని సినిమాలు ఆడకపోవడం అనేది నేను ఎంచుకొన్న చిత్రాలు రాంగ్ చాయిస్ కావడమే.

   చిరును చాలాసార్లు కలిశా

  చిరును చాలాసార్లు కలిశా

  గురుడ వేగ చిత్ర రిలీజ్‌కు ముందు చిరంజీవిని కలువడంపై స్పందిస్తూ.. మా మధ్య చోటుచేసుకొన్న వివాదాల తర్వాత మేము చాలాసార్లు కలుసుకొన్నాం. కానీ ఆ విషయాలు ఎవరికీ తెలియవు. మేము చెప్పుకోవాల్సిన అవసరం రాలేదు. ఇప్పుడు కలువడం అందరికీ తెలిసింది. దాంతోనే అనేక రూమర్లు, వివాదాలు చోటుచేసుకొన్నాయి. వాటిని మేము పట్టించుకోలేదు.

   పవన్ కల్యాణ్ కౌంటర్ ఇచ్చాడు

  పవన్ కల్యాణ్ కౌంటర్ ఇచ్చాడు

  పవన్ కల్యాణ్‌ను నేను ఏదో అన్నాను. దానిని ఆయన మనసులో పెట్టుకోవచ్చు. అందు వల్లనే గబ్బర్‌సింగ్ చిత్రంలో నాపై సెటైర్ వేస్తూ పాట పెట్టాడు. దానిని నేను పెద్దగా పట్టించుకోలేదు. నేను చేసిన దానికి పవన్ కౌంటర్ ఇచ్చారు. దానికి దానికి సరిపోయింది. ఇప్పుడు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు.

   బాలకృష్ణతో చేస్తే తప్పేంటి

  బాలకృష్ణతో చేస్తే తప్పేంటి

  గరుడవేగ పార్ట్2లో బాలకృష్ణ హీరో అయితే తప్పేమిటి. బాలయ్యతో సినిమా చేయాలనే ప్రపోజల్ నేనే పెట్టాను. ప్రవీణ్ సత్తారుతో సినిమా చేద్దామంటే సరే అన్నారు. కేఎస్ రవికుమార్‌తో రూపొందిస్తున్న చిత్రంలో ఓ పాత్రలో నటించమని బాలయ్య అడిగాడు. కానీ నేను ఒప్పుకోలేదు. ఎందుకంటే మేమిద్దరం తొలిసారి చేసే సినిమా అది కాదు అనేది నా అభిప్రాయం.

   తారాచౌదరీతో అక్రమ సంబంధం.

  తారాచౌదరీతో అక్రమ సంబంధం.

  తారాచౌదరీతో నాకు ఎలాంటి సంబంధాలు లేవు. ఆమె ఇంట్లో నా ఫొటో ఉండటం వల్లనే వివాదం చోటుచేసుకొన్నది. ఒకానొక సమయంలో నాతో ఫోటో తీసుకోవడానికి వచ్చిన సమయంలోనే తొలిసారి తారాచౌదరీని కలిశాను. ఆ తర్వాత నేను మరో సందర్భంలో కలిశాను. ఒకవేళ అలాంటి సంబంధం లేదు. ఉంటే నేనే చెప్తాను. కేవలం నేను జీవితకే భయపడుతాను.

  నేను రాముడిని కాదు..

  నేను రాముడిని కాదు..

  అయితే దాంపత్య జీవితంలో రాముడిని కాదు. తారా చౌదరీ విషయంలో నేను రాముడినే. పెళ్లికి ముందు అఫైర్లు ఉన్నాయి. జీవితతో పెళ్లి తర్వాత కొందరితో సంబంధాలు కూడా ఉన్నాయి. అయితే జీవితంలో నేను కృష్ణుడిని కాదు. కొన్ని సంఘటనలు అలా యాక్సిండెట్‌గా జరిగిపోయాయి.

  English summary
  Hero Rajasekhar again strikes on Silver Screen. He tastes success with Garuda vega movie. Before that He lost his mother and Jeevitha's brother. In this situation, Rajasekhar speaks to youtube channel. He revealed and clarifies some issues.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X