దాసరి నారాయణరావు తన దర్శకత్వంలో హీరో రాజశేఖర్ కు ఒక హిట్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారని సమాచారం. ఇందులో సీనియర్ నటి జయసుధకి కూడా ఓ ప్రధాన పాత్ర ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఎందుకీ హఠాత్తు నిర్ణయం అంటే..దాసరి సిరీ మీడియా పతాకంపై రాజశేఖర్ హీరోగా దాసరి నిర్మించి సత్యమేవ జయితే ఫ్లాపు అవ్వటమేనట. అసలు రాజశేఖర్ కి ఎవ్వరూ బ్యానర్ ఇవ్వకపోతే దాసరే..మన కాంగ్రేస్ వాడేనని సిరీ మీడియాపై సినిమా తీసుకోమని చెప్పారు. అయితే సినిమా ఫెయిల్యూర్ ని జీవిత, రాజశేఖర్ ల కన్నా దాసరినే ఎక్కువ బాధించిందని చెప్తున్నారు. అలాగే అందులో చిరంజీవిపై సెటైర్స్ పెడుతూంటే నైతికంగా మధ్దతిచ్చి ముందుకు వెళ్ళమని దాసరే చెప్పారని ఇప్పుడు వార్తలు వినపడుతున్నారు. అలాగే దాసరి తాజాగా నిర్మించి, నటిస్తున్న మేస్త్రి సినిమాలో కూడా ప్రజారాజ్యంపై పూర్తి సెటైర్స్ ఉన్నాయని అంటున్నారు. ఏదైమైనా దాసరి, రాజశేఖర్ ని గట్టెక్కించటానికి నడుం బిగించారన్నమాట.