తండ్రి కొడుకులుగా రాజశేఖర్

అన్నతంగి కథలో హీరో అతిగా చెల్లిని ప్రేమిస్తూంటాడు. ఓ డబ్బున్న కుటుంబంలో కుర్రాడుకిచ్చి తన చెల్లి పెళ్ళి ఘనంగా చేస్తాడు . కాని ఆమె భర్తని అన్నదమ్ములే వ్యాపారంలో మోసం చేస్తారు. అతను దాంతో జైలు కెళ్ళతాడు. దిక్కు తోచని స్ధితిలో ఆమె తన అన్న గారింటికి వస్తుంది. కాని అప్పుడు అతనుండడు. వదిన అవమానం చేస్తుంది. దాంతో ఆకలితో ఉన్న పిల్లలు , అవమానం దహిస్తుంటే ఆత్మహత్య చేసుకుంటుంది. ఈలోగా వచ్చిన అన్న ఇది చూసి తన చెల్లి దారినే పడతాడు. ఇలా ఈ కథ విపరీతమైన సెంటిమెంటుతో అన్నా చెల్లెలు మధ్యే సాగుతుంది. మహిళలలకి నచ్చే అవకాశం ఉన్న ఈ చిత్రం మేలో ప్రేక్షకుల ముందుకు రానున్నది. దీనిని మెగా సూపర్‌గుడ్ ఫిలిమ్స్ బానర్‌పై ఎన్.వి. ప్రసాద్, పరస్ జైన్ నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











