చిరంజీవిని ఆహ్వానించిన రాజశేఖర్, చిరు వస్తే దోస్తీ కుదిరినట్లేనా?

పీఎస్వీ గరుడ వేగ సినిమా ప్రీమియర్ షోకు చిరంజీవిని ఆహ్వానించినట్లు రాజశేఖర్ తెలిపారు.

By Bojja Kumar

మెగాస్టార్ చిరంజీవి, హీరో రాజశేఖర్ మధ్య గతంలో కొన్ని విబేధాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఆ మధ్య ఇరు వర్గాలు మీడియా సాక్షిగా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. రాను రాను ఈ గొడవలు సద్దుమణిగిపోయాయి. ప్రస్తుతం ఇద్దరి మధ్య ఫ్రెండ్లీ వాతావరణమే ఉందని చెప్పాలి.

Recommended Video

గ‌రుడ‌వేగ’కు సెన్సార్‌ కూడా ప్లస్సయింది..

రాజశేఖర్ నటించిన 'పీఎస్వీ గరుడవేగ' 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో రాజశేఖర్ మాట్లాడుతూ చిరంజీవిని ఇటీవలే కలిశానని, 'గరుడ వేగ' ట్రైలర్ బాగుందని మెగాస్టార్ చిరంజీవి మెచ్చుకున్నారని, సినిమా చూసేందుకు ఆయన్ని ఆహ్వానించానని చెప్పారు.

చిరు ఆఫీసులో కూడా...

చిరు ఆఫీసులో కూడా...

చిరు ఆఫీసులో కూడా ఈ సినిమా గురించే మాట్లాడుకొంటున్నారని ఆయన తనతో చెప్పిన విషయాన్ని రాజశేఖర్ ఈ సందర్భంగా ప్రస్తావించారు.

చిరు మూవీలో విలన్ పాత్రకు సిద్ధమన్న రాజశేఖర్

చిరు మూవీలో విలన్ పాత్రకు సిద్ధమన్న రాజశేఖర్

కథ నచ్చితే చిరంజీవి సినిమాలో సైతం విలన్ రోల్ చేయడానికి తాను సిద్ధమని గతంలో రాజశేఖర్ చెప్పిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ రోజు ప్రెస్ మీట్లో రాజశేఖర్ మాట్లాడుతూ... ఇటీవల రామ్ చరణ్ నటించిన ‘ధృవ' సినిమాలో అరవిందస్వామి తరహా పాత్రలో ఉన్నా తాను విలన్ రోల్ చేయడానికి సిద్ధమే అని రాజశేఖర్ అన్నారు.

గతంలో చిరంజీవి, రాజశేఖర్ మధ్య విబేధాలకు కారణం?

గతంలో చిరంజీవి, రాజశేఖర్ మధ్య విబేధాలకు కారణం?

గతంలో సినిమా రంగంలో తన ఎదుగుదలకు చిరంజీవి అండ్ కో అడ్డుతగులుతూ వచ్చారనే భావన రాజశేఖర్‌లో ఉండేదని, ఆ క్రమంలోనే రాజకీయ కారణాలు కూడా తోడయ్యాయని...అలా వీరి మధ్య చిన్నగా మొదలైన విబేధాలు ఆ మధ్య తారా స్థాయికి చేరాయని అప్పట్లో టాక్.

సినిమా గొడవలకు, రాజకీయ కారణాలు కూడా తోడై

సినిమా గొడవలకు, రాజకీయ కారణాలు కూడా తోడై

చిరంజీవి నటించిన ‘ఠాగూర్' మూవీ తమిళ హిట్ మూవీ ‘రమణ'కు రీమేక్. వాస్తవానికి ఈ చిత్రం రీమేక్ రైట్స్ రాజశేఖర్ దక్కించుకుని నటించాలని భావించాడని, అయితే చిరంజీవి ఆ సినిమా తనకు దక్కకుండా చేశారనే కోపం గతంలో రాజశేఖర్ లో ఉండదని అప్పట్లో వార్తలు వినిపించాయి. అంతే కాకుండా హిందీ హిట్ మూవీ ‘దబాంగ్' చిత్రాన్ని రాజశేఖర్ రూ. 1.35 లక్షలకు దక్కించుకోవాలని చూశారని, అయితే పవన్ కళ్యాణ్ ఈ చిత్రాన్ని 1.75 లక్షలకు ఎగరేసుకెళ్లారని.....ఇలా సినిమా రంగానికి సంబంధించిన విషయాలే వీరి మధ్య గతంలో విబేధాలకు దారి తీసాయని, తర్వాత రాజకీయ కారణాలు తోడయ్యాయిన టాక్.

గరుడ వేగ సినిమా చూసేందుకు చిరంజీవి వస్తారా?

గరుడ వేగ సినిమా చూసేందుకు చిరంజీవి వస్తారా?

ప్రస్తుతం చిరంజీవిని స్వయంగా రాజశేఖర్ తన ‘పిఎస్వీ గరుగవేగ' సినిమా చూసేందుకు ఆహ్వానించారు. చిరంజీవి సినిమా చూడటానికి వస్తే వీరి మధ్య మళ్లీ స్నేహబంధం మొదలైనట్లే అనే అని ఫిల్మ్ నగర్లో చర్చించుకుంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X