twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్ కల్యాణ్‌పై జీవిత, రాజశేఖర్ ఎటాక్‌: ఆ వ్యాఖ్యలతో ప్రమాదకరం..ఆ ఎఫెక్ట్ వల్ల ఇంకా అప్పుల్లోనే!

    |

    జీవిత, రాజశేఖర్ దంపతులు సోమవారం ఉందయం వైసిపి అధినేత జగన్ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వెంటనే మీడియా సమావేశం నిర్వహించి పలు విషయంపై తమ అభిప్రాయాలు తెలియజేశారు. జగన్ తో ఉన్న విభేదాలు తొలగిపోయాయని, అయన ముఖ్యమంత్రి అయ్యేందుకు కృషి చేస్తామని జీవిత, రాజశేఖర్ ప్రకటించారు. వైసిపి తరుపున ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొనబోతున్నట్లు జీవిత, రాజశేఖర్ తెలిపారు. ఈ మీడియా సమావేశంలో రాజశేఖర్ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలు రాజకీయ చర్చకు దారి తీశాయి.

    కావాలని అటాక్ చేయం

    కావాలని అటాక్ చేయం

    మీడియా అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. తాము పవన్ కళ్యాణ్ పై ఎప్పుడూ కావాలని ఎటాక్ చేయం అని రాజశేఖర్ తెలిపారు. కానీ ఇటీవల పవన్ కళ్యాణ్ తెలంగాణ గురించి చేసిన వ్యాఖ్యలు సరికాదని రాజశేఖర్ అన్నారు. ఆయన అలా మాట్లాడి ఉండకూడదు. తెలంగాణాలో ఆంధ్ర ప్రజలపై దాడులు జరుగుతున్నాయి అంటూ మాట్లాడారు. అది చాలా రాంగ్. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల వలన అలాంటి పరిస్థితులు తలెత్తే ప్రమాదం ఉందని రాజశేఖర్ అన్నారు.

    పచ్చి అబద్దం

    పచ్చి అబద్దం


    పవన్ కళ్యాణ్ చెప్పిందే నిజమైనతే ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ స్వీప్ చేసి ఉండకూడదు. కానీ ఆంధ్ర ప్రజలు కూడా టిఆర్ఎస్ పార్టీకి ఓట్ వేశారని రాజశేఖర్ అన్నారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు పచ్చి అబద్దం అని రాజశేఖర్ తెలిపారు. పవన్ కళ్యాణ్ అలాంటి వ్యాఖ్యలని జనాలపై రుద్దడం సరికాదు అంటూ రాజశేఖర్ అభిప్రాయ పడ్డారు.

    చిత్ర పరిశ్రమకు చెందిన వ్యక్తే

    చిత్ర పరిశ్రమకు చెందిన వ్యక్తే

    జీవిత మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ మా చిత్ర పరిశ్రమకు చెందిన వ్యక్తే. మాపై మేము విమర్శలకు దిగడం సరైనది కాదు. త్వరలో పాల్గొనబోయే ఎన్నికల ప్రచారంలో కూడా మేము ఎవరిని టార్గెట్ చేయం. కానీ విమర్శించాల్సిన పరిస్థితి వస్తే మాత్రం సైలెంట్ గా ఉండేది లేదని జీవిత అన్నారు. ఎవరైనా తమని తిడితే ఊరుకుని వెళ్లిపోయే వ్యక్తిని తాను కాదని జీవిత అన్నారు.

    ఇప్పటికి అప్పుల్లోనే

    ఇప్పటికి అప్పుల్లోనే

    గత పదేళ్లలో తాము ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం అని రాజశేఖర్ అన్నారు. సరైన సినిమాలు లేక, నిర్మించిన చిత్రాలు సరిగా ఆడకపోవడంతో అప్పుల్లో చిక్కుకున్నాం అని రాజశేఖర్ అన్నారు. గరుడ వేగ చిత్రం తమని ఆదుకుంది అని రాజశేఖర్ అభిప్రాయ పడ్డారు. ఆ చిత్రం వలన సగానికిపైగా అప్పులు తీరిపోయాయి. ఇప్పటికీ అప్పుల్లోనే ఉన్నాము. కానీ మా అసోసియేషన్ ఎన్నికల్లో విజయం సాధించడం, ఒక పార్టీ తమ నిజాయితీని నమ్మి ఆహ్వానించడం.. ఇలాంటి మంచి పరిణామాలు చూస్తే సంతోషంగా ఉందని రాజశేఖర్ అన్నారు.

    English summary
    Rajasekhar, Jeevitha sensational comments on Janasena Chief Pawan Kalyan
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X