పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలుపై జీవిత,రాజశేఖర్ దంపతులు ఓ ప్రెవేట్ టీవీ ఛానెల్ లో కామెంట్ చేయటాన్ని యువరాజ్యం అధ్యక్ష్యుడు పవన్ కళ్యాణ్ తీవ్రంగా దుయ్యబట్టారు. తెలుగు సినిమాల్లో నటిస్తున్న రాజశేఖర్ ముందుగా తెలుగు మాట్లాడటం నేర్చుకోవాలని పవన్‌కల్యాణ్ సూచించారు. త.త..త అంటూ మాట్లాడుతుంటారని విమర్శించారు. కాంగ్రెస్‌లో చేరావు కదా అని పిచ్చిపిచ్చిగా మాట్లాడకు అని రాజశేఖర్‌ను హెచ్చరించారు. చిరంజీవిపై రాజశేఖర్ చేసిన విమర్శల్ని ప్రస్తావించినపుడు ఆయన పై విధంగా స్పందించారు. రాజశేఖర్ స్థాయికి తాను దిగజారబోనన్నారు. రెండ్రోజుల కిందట ధర్నాలో కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి తాను చేసిన వ్యాఖ్యలు, దానిపై ఆ పార్టీ నాయకుల స్పందన, వరంగల్ జిల్లాలో తన కాన్వాయ్‌పై జరిగిన రాళ్ల దాడి తదితరాలపై గురువారం పవన్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు.