రాజశేఖర్ మహంకాళి షూటింగ్ ప్రారంభం
రాజశేఖర్ పోలీసాఫీసరుగా నటిస్తున్న మహంకాళి సినిమా షూటింగ్ సోమవారంనాడు రామానాయుడు స్టూడియోలో ప్రారంభమైంది. అంజేరి ఆర్ట్స్ పతాకంపై యేలూరి సురేందర్ రెడ్డి, ఎ.పరంధామరెడ్డి నిర్మిస్తున్నారు. కార్తికేయ దర్శకునిగా పరిచయమవుతున్నారు. హీరోపై తీసిన ఓపెనింగ్ షాట్‌కు క్లాప్ సౌత్ చాంబర్ ప్రెసిడెంట్ సి.కల్యాణ్ కొట్టారు. స్విచాన్ పోలీసు కమీషనర్ ప్రభాకర్ రెడ్డి చేశారు. బి.గోపాల్ దర్శకత్వం వహించారు.
ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ - నన్ను చాలామంది మగాడులాంటి కథలో ఎప్పుడు కన్పిస్తారని అడుగుతున్నారు. అలాంటి పవర్‌ఫుల్ పాత్ర ఈ చిత్రంలో ఉంటుంది. నా అభిమానులకు నచ్చే చిత్రమిది. చాలా గ్యాప్ తర్వాత పోలీసాఫీసర్ పాత్రలో నటిస్తున్నాను" అన్నారు. నిర్మాతలు మాట్లాడుతూ - "రేపటి నుంచి షూటింగ్ ప్రారంభిస్తున్నాం. డిసెంబరుకు పూర్తి చేసి సంక్రాతికి విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం" అన్నారు. వాణీవిశ్వనాథ్ నటిస్తోన్న ఈ చిత్రంలో ప్రదీప్ రావత్, ఆశిష్ విద్యార్థి, సత్యప్రకాష్, సలీంపాండా, సుత్తివేలు తదితరులు నటిస్తున్నారు. సంగీతం: చిన్నా, మాటలు: మోహన్, కెమెరా: విందా, స్క్రీన్ ప్లే-దర్శకత్వం: కార్తికేయ.


Click it and Unblock the Notifications











