ఎన్ని దెబ్బలు తిన్నా బుద్ది తెచ్చుకోని హీరో రాజశేఖర్
చిరంజీవిని, పీర్ఫీ పార్టీని,బ్లడ్ బ్యాంక్ ని తిట్టడంలో పెట్టే శ్రద్దలో వన్ పర్శంట్ కూడా రాజశేఖర్ చిత్రాలుపై పెట్టడం లేదని వినపడుతోంది. ముఖ్యంగా రీమేక్ లు చేస్తూ వరసగా ప్లాప్ దెబ్బలు తింటున్నా బుద్ది తెచ్చుకోకుండా మళ్ళీ మళ్ళీ అదే రూటులో వెళ్ళటం ఆయన అభిమానులుకు ఇబ్బందికరంగా మారింది. తాజాగా ఆయన హిందీలో అట్టర్ ప్లాప్ అయిన రిస్క్ అనే చిత్రాన్ని తెలుగులోకి తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నాడు. మహంకాళి టైటిల్ తో తయారయ్యే ఈ చిత్రానికి కథ అని రాజశేఖర్ పేరే వేస్తున్నారు. ఎందుకంటే రాజశేఖరే ఈ సినిమా కాపీ కొడదాం అనే ఐడియా ఇచ్చాడుట. ఇక రణదీప్ హుడా, వినోద్ ఖన్నా కాంబినేషన్ లో వచ్చిన ఈ చిత్రం బాలీవుడ్ లో బెస్ట్ డిజాస్టర్ గా మిగిలింది. ఇప్పుడు దీన్ని తీసి రాజశేఖర్ ఏం పాముకుంటోడోనంటున్నారు. ఇక ఈ చిత్రంలో రాజశేఖర్ ఎనకౌంటర్ స్పెషలిస్టుగా కనపిస్తారు. నట్టికుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా కార్తికేయ అనే నూతన దర్శకుడు పరిచయమవుతున్నాడు. ఈ చిత్రంలో ప్రదీప్ రావత్, సలీమ్ పండా, ఆర్ కె, ఆషిష్ విద్యార్ధి, మురళీ శర్మ, సుప్రీత్, పిడి రాజు వంటి వారు నటిస్తున్నారు. పి.జి వింద కెమెరా అందిస్తుంటే చిన్న సంగీతం సమకూరుస్తారు.


Click it and Unblock the Notifications











