Don't Miss!
- News రిజర్వేషన్లు రద్దు చేస్తారు: మోడీ, కేసీఆర్‌పై రేవంత్ సంచలన ఆరోపణలు
- Sports SRH vs RCB: కొంపముంచిన విరాట్ కోహ్లీ జిడ్డు బ్యాటింగ్!
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
రాజశేఖర్ చిత్రానికి డైరక్టర్ ని తప్పించి జీవితే...
ఈ చిత్రానికి ముందుగా వేరే దర్శకుణ్ని అనుకున్నాం. కొన్ని కారణాల వలన ఆయన దర్శకుడిగా కొనసాగలేకపోయారు. జీవిత ఆ బాధ్యతలు తీసుకుంది. ప్రతి సన్నివేశాన్ని చక్కగా తీర్చిదిద్దింది. ఓ హిందీ చిత్రం స్ఫూర్తితో ఈ సినిమాను రూపొందిస్తున్నాం అంటూ చెప్పుకొచ్చారు రాజశేఖర్. ఆయన తాజాగా 'మహంకాళి' అనే చిత్రం చేస్తున్నారు. ఆ చిత్రానికి మొదట కార్తికేయ అనే దర్శకుడుతో ప్రారంభించారు. అయితే అనుకోని విధంగా సీన్ లో కి జీవిత ప్రవేశించి మెగాఫోన్ చేపట్టింది. గతంలోనూ రాజశేఖర్ చిత్రాలకు ఇలాగే జరగటంతో ఇది కామన్ అంటున్నారు సినిమావాసులు.
ఈ చిత్రంలో రాజశేఖర్..మహంకాళి అనే ఎన్ కౌంటర్ స్పెషలిస్టుగా చేస్తున్నారు. కధ విషయానికి వస్తే ..హైదరాబాద్ నగరం ఉగ్రవాదులకి అడ్డాగా మారింది. దేశంలో ఎక్కడ పేలుళ్లు జరిగినా దాని మూలాలు రాజధానిలో ఉన్నాయని వార్తలొస్తున్నాయి. అంటే మన వ్యవస్థ ఎంత లోపభూయిష్టంగా ఉందో అర్థమవుతుంది. ఇలాంటి విషయాల్ని చర్చించే సినిమాయే 'మహంకాళి'. ఇక చిత్రం వాస్తవిక దృక్పథంతో సాగి అందరికీ నచ్చేలా తీర్చిదిద్దుతున్నాం. తప్పకుండా ఇది 'అంకుశం' సినిమాకు రెండో భాగంలా ఉంటుంది అంటున్నారు రాజశేఖర్. ఈ చిత్రంలో ప్రదీప్ రావత్, సలీమ్ పండా, ఆర్ కె, ఆషిష్ విద్యార్ధి, మురళీ శర్మ, సుప్రీత్, పిడి రాజు వంటి వారు నటిస్తున్నారు. పి.జి వింద కెమెరా అందిస్తుంటే చిన్న సంగీతం సమకూరుస్తారు.