రోజుకు 18గంటలు షూటింగ్‌లో పాల్గొనక తప్పదని దౌర్జన్యం చేశారని... ఈడ్చుకుంటూ తీసుకుని వెళ్లి సెట్స్‌లో పడేశారని... చంపేస్తానని రాజశేఖర్ బెదిరించారని హీరోయిన్ నీతూచంద్ర హైదరాబాద్ పోలీసు కమిషనర్‌కు ఈ-మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. 'సత్యమేవ జయతే' సినిమా షూటింగ్ సందర్భంగా తనను రాజశేఖర్, జీవిత తీవ్రంగా వేధించారని ఆమె ఫిర్యాదులో వివరించారు. తనను శారీరకంగా, మానసికంగా వేధించిన రాజశేఖర్, ఆయన భార్య జీవితలపై చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ మెయిల్‌లో వచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసు కేసు నమోదు చేయలేమని, రాత పూర్వకంగా పోలీసు స్టేషన్‌లో ఫిర్యా దు ఇస్తేనే కేసు నమోదు చేయడం సాధ్యం అవుతుందని హైదరాబాద్ పోలీసు కమిషనర్ ప్రసాదరావు మీడియాతో చెప్పారు.