మోహన్ బాబు పై కుట్ర పన్నుతున్నది ఎవరు?

By Sindhu

తాను నటించే సినిమాల్లో పెద్ద హీరోయిన్లు దొరకడంలేదనీ, ఇదంతా తానంటే గిట్టనివారు చేస్తోన్న కుట్ర అనీ, తనతో నటించొద్దని హీరోయిన్లను కొందరు బెదిరిస్తున్నారనీ అప్పట్లో హీరో రాజశేఖర్, పరోక్షంగా చిరంజీవిపై ఆరోపణలు చేసిన సంగతి అందరికీ గుర్తుండే వుంటుంది. ఇప్పుడు మోహన్ బాబు కూడా దాదాపు అవే ఆరోపణలు చేస్తున్నారు. డైరెక్ట్ గా చిరంజీవిపైన కామెంట్స్ చేయకపోయినా, తన కుమారుడు 'సలీం" ఆడియో విడుదల వేడుకలో 'మోహన్ బాబు సినిమాల్లో నటించొద్దు" అంటూ కొందరు కుట్ర పన్నుతున్నారని అంటున్నారు మోహన్ బాబు.

తన బ్యానర్ లో నటించే హీరోయిన్లను చాలా గౌరవిస్తామనీ, ఆ గౌరవానికి నిదర్శనం నేడు 'సలీం" ఆడియో విడుదలకు మమతామోహన్ దాస్ హాజరు కావడమని చెప్పుకొచ్చారు మోహన్ బాబు. అదేమి లింకోగానీ, మోహన్ బాబు చేసిన కామెంట్ అసందర్భంగానే తోచింది, 'సలీం" ఆడియో విడుదల వేడుకకు హాజరైనవారికి. అయినా హీరోయిన్ల పట్ల మోహన్ బాబు చాలా కఠిన వైఖరి అవలంభిస్తారని గతంలో చాలా సందర్భాల్లో రుజువైంది. హీరోయిన్లను బెదిరించడం, వారిపై చెయ్యి చేసుకోవడం మోహన్ బాబుకి అలవాటైన పనేనంటూ ఫిలిం సర్కిల్స్ లో బలమైన ప్రచారం ఇప్పటికీ జరుగుతూనే వుంది. ఈ అపవాదం నుండి బయటపడేందుకే మోహన్ బాబు, మమతామోహన్ దాస్ ని ఉదాహరణగా చూపించినట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X