'మా అన్నయ్య బంగారం' పాటల చిత్రీకరణ స్విట్జర్లాండ్ లో
"మా అన్నయ్య బంగారం" సినిమాపాటల చిత్రీకరణ స్విట్జర్లాండ్ లో జరుగుతోంది. హీరో రాజశేఖర్ మాట్లాడుతూ "ఆణిముత్యాల్లాంటి ఐదు పాటలున్నాయి. తొలికాపీ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నాను" అని చెప్పారు. "సంప్రదాయాన్ని, నేటి నవీన అంశాలను మేళవిస్తూ రూపొందిస్తున్న చిత్రమిది.
ఓ మంచి పాత్రను పోషిస్తున్నాను" అని కమలినీ అన్నారు. నిర్మాత మాట్లాడుతూ "రాజశేఖర్, కమలినీ ముఖర్జీలపై రెండు పాటలను స్విట్జర్లాండ్‌లో తీస్తున్నాం. ఈ నెల 14తో చిత్రీకరణ పూర్తవుతుంది.
17న ఆడియోను, 29న సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని అన్నారు. అందరి సహకారంతో సినిమా బాగా వస్తోందని దర్శకుడు జొన్నలగడ్డ చెప్పారు. ఈ చిత్రంలో బ్రహ్మానందం, చలపతిరావు, శివపార్వతి, రోహిత్, ఆదిత్య ఓమ్, యశ్వంత్, పింగ్ పాంగ్, రాజ్ కల్యాణ్ తదితరులు నటించారు.
ఈ చిత్రానికి కథ: భూపతిరాజా, మాటలు: పరుచూరి బ్రదర్స్, సంగీతం: ఎస్.ఎ.రాజ్‌కుమార్, కెమెరా: డి.ప్రసాదబాబు, కూర్పు: గౌతంరాజు, కళ: కె.రమణ, ఫైట్స్: జయ్, నిర్మాణ సారథ్యం: నట్టి లక్ష్మీకరుణ, సమర్పణ: నట్టి క్రాంతి.


Click it and Unblock the Notifications











