వాట్..! అది మోహన్ బాబు, రాజశేఖర్‌ల సినిమానా?.. ఆ సినిమా ఏంటంటే..
రాజశేఖర్ - మోహన్ బాబు కలయికలో ఎడిటర్ మోహన్ ఒక సినిమాను నిర్మించాలని అనుకున్నారట. అదే హనుమాన్ జంక్షన్. ఆ విధంగా ఓ మల్టి స్టారర్ క్యాన్సిల్ అయ్యి మరో మల్టి స్టారర్ కి దారి తీసింది.
Recommended Video

టాలీవుడ్ లో ఒక సంవత్సరం లో ఎన్ని సినిమాలు వస్తాయో అంతకంటే ఎక్కువ సినిమాలే మధ్యలో ఆగిపోతాయి.. కొన్ని సినిమాలైతే దాదాపు షూట్ మొదలయ్యేదాకా వచ్చిమరీ అటకమీదికెక్కేస్తాయి. కారణాల్వేమిటీ అంటే సవాలక్ష.., డబ్బు, యాక్టర్స్ కి కథ నచ్చకపోవటం, ఇక కొన్నైతే విభేదాల వల్ల కూడా ఆగిపోయాయి.

ఓ మల్టి స్టారర్ మూవీ ఆగిపోయింది
అయితే అదే తరహాలో విభేదాలు వస్తాయేమో అని ఓ మల్టి స్టారర్ మూవీ ఆగిపోయిందట. అదీ హీరో రాజశేఖర్, మరో క్రేజీ స్టార్ మంచు మోహన్ బాబుల కాంబోలో ప్లాన్ చేసిన సినిమా... చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ న్యూస్ ప్రస్తుతం చాలా వైరల్ అయ్యింది.

మంచి హిట్ అందుకొని
రీసెంట్ గా గరుడవేగ సినిమాతో మంచి హిట్ అందుకొని ఫామ్ లోకి వచ్చిన రాజశేఖర్ ఈ మధ్యన వార్తల్లో బాగా నిలుస్తున్నారు. ఇంటర్వ్యూలలో కొన్ని ఘటనల గురించి చెబుతూ.. ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారుస్తున్నారు. ఇకపోతే రాజశేఖర్ - మోహన్ బాబు కలయికలో ఎడిటర్ మోహన్ ఒక సినిమాను నిర్మించాలని అనుకున్నారట.

తేంకాశీపట్నం అనే కథ
మళయాలం లో హిట్ అయిన తేంకాశీపట్నం అనే కథను కూడా ఒకే చేశారు. అయితే రాజశేఖర్ సినిమా షూటింగ్ లకు లేట్ గా వస్తారని అప్పట్లో టాక్ బాగానే ఉండేది. అయితే నిర్మత నటీనటులకు టెక్నీషియన్స్ కి అడ్వాన్స్ లు కూడా ఇచ్చేసి షూటింగ్ ని స్టార్ట్ చేయడానికి రెడీగా ఉన్నారట.

రాజశేఖర్ ని లంచ్ కి పిలిపించి
కానీ మోహన్ బాబు ఒకరోజు రాజశేఖర్ ని లంచ్ కి పిలిపించి షూటింగ్ కి కరెక్ట్ టైమ్ రావాలని చెప్పడంతో రాజేశేఖర్ ఆ తర్వాత తన అభిప్రాయాన్ని మార్చుకున్నారట. ఇద్దరి మధ్య రిలేషన్స్ లో తేడా రాకూడదని రాజశేఖర్ సినిమా నుంచి తప్పుకున్నారని తెలుస్తోంది.

హనుమాన్ జంక్షన్
అయితే వెంటనే మోహన్ వారి స్థానంలో జగపతి బాబు - అర్జున్ ని సెలెక్ట్ చేసి సినిమాను స్టార్ట్ చేశారు. అదే హనుమాన్ జంక్షన్. సినిమా విడుదల తర్వాత పాజిటివ్ టాక్ తో మంచి హిట్ అయ్యింది. ఆ విధంగా ఓ మల్టి స్టారర్ క్యాన్సిల్ అయ్యి మరో మల్టి స్టారర్ కి దారి తీసింది.


Click it and Unblock the Notifications











