twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నేనూ దివ్యాంగుడినే, నన్ను చూసి హేళన చేసేవారు: రాజశేఖర్

    By Bojja Kumar
    |

    Recommended Video

    నేనూ దివ్యాంగుడినే.. నన్ను చూసి హేళన చేసేవారు..! | Filmibeat Telugu

    నేనూ దివ్యాంగుడినే, నాలోనూ శారీరక లోపం ఉంది అంటూ హీరో రాజశేఖర్ వ్యాఖ్యానించారు. ప్రపంచ వ్యాంగుల దినోత్సవం సందర్భంగా నెక్లెస్‌ రోడ్‌లో దివ్యాంగులు చేపట్టిన నడక కార్యక్రమంలో రాజశేఖర్ అతిథిగా పాల్గొన్నారు.

    ఈ సందర్భంగా రాజశేఖర్‌ మాట్లాడుతూ దివ్యాంగులు ఎవరూ నిరుత్సాహపడకూడదని, ఆత్మస్తైర్యంతో ముందుకు సాగాలని సూచించారు. తాను కూడా దివ్యాంగుడినే అని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

    నాకు నత్తి ఉండేది

    నాకు నత్తి ఉండేది

    జనాభాలో 10 శాతం దివ్యాంగులు ఉన్నారు. మీకు తెలుసో.. తెలియదో.. నేను కూడా దివ్యాంగుడినే. నాకు చిన్నప్పటి నుంచి నత్తి ఉండేది. మాటలు సరిగా వచ్చేవి కాదు. మా నాన్న గారి పేరు అడిగితే చెప్పలేకపోయేవాడ్ని, అప్పట్లో ఇది ఎక్కువగా ఉండేది, ఇపుడు అది కాస్త తగ్గింది అని రాజశేఖర్ తెలిపారు.

    అంతా నన్ను హేళన చేసేవారు

    అంతా నన్ను హేళన చేసేవారు

    చిన్నతనంలో ఇంటి దగ్గర, పాఠశాలలో అందరితో కలిసి ఆడుకుంటున్న సమయంలో నా నత్తి చూసి అంతా నవ్వేవారు. హేళన చేసేవారు. వారు అలా చేస్తుంటే చాలా బాధపడేవాడ్ని. ఆత్మస్తైర్యంతో ముందుకు సాగాను కాబట్టే ఇక్కడి వరకు వచ్చానని రాజశేఖర్ తెలిపారు.

     నత్తి ఉందన్న భయంతో ముందు సినిమాల వైపురాలేదు

    నత్తి ఉందన్న భయంతో ముందు సినిమాల వైపురాలేదు

    చిన్నతనంలో సినిమాలు చూస్తున్నపుడే యాక్టర్ అవ్వాలని ఉండేది. నువ్వు చూడటానికి బావుంటావు సినిమాల్లోకి వెళ్లాలని చాలా మంది చెప్పేవారు. కానీ నత్తి ఉందన్న భయంతో అటు వైపు వెళ్లకుండా మెడిసిన్లో చేరాను. డాక్టర్‌ అయిన తర్వాత కూడా నటుడ్ని కావాలనే కోరిక వెంటాడుతుంటే ధైర్యం చేసి సినిమాల్లోకి వచ్చాను.... అని రాజశేఖర్ తెలిపారు.

     అందరితో సమానం అని నిరూపించుకోవాలి

    అందరితో సమానం అని నిరూపించుకోవాలి

    నేను ఇపుడు నత్తిని కూడా అధిగమించి, 90 శాతం ఆ బాధ నుంచి బయటికి వచ్చాను. మనకు కావాల్సింది మన మీద మనకు నమ్మకం, దాని కోసమే ఇదంతా చెప్పాను. మనం దివ్యాంగులం కాదు.. అందరితో సమానం అని నిరూపించాలి' అని రాజశేఖర్ వ్యాఖ్యానించారు.

    మనకు కావాల్సింది జాలి కాదు, సహకారం కావాలి

    మనకు కావాల్సింది జాలి కాదు, సహకారం కావాలి

    దివ్యాంగులకు కావాల్సింది జాలి చూపడం కాదు. వారు జీవితంలో ముందుకు సాగడానికి చేయూత అవసరం. నా జీవితాంతం నాలాంటి దివ్యాంగులకు సహాయం చేస్తూనే ఉంటాను.... అని ఈ సందర్భంగా రాజశేఖర్ వ్యాఖ్యానించారు.

    ఈ కార్యక్రమంలో

    ఈ కార్యక్రమంలో

    ఈ కార్యక్రమంలో ఇంకా ఉపముఖ్యమంత్రి మహమూద్‌ అలీ, మంత్రులు ఈటెల రాజేందర్‌, మహేందర్‌రెడ్డి, భాజపా ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, సినీనటి జీవిత తదితరులు పాల్గొన్నారు.

    English summary
    On the eve of the World Disability Day on December 3, a walk was conducted involving the disabled people at Necklace road here on Saturday. Telangana Deputy Chief Minister (Revenue) Mohammad Mahmood Ali, Finance Minister Etala Rajendar, Transport Minister P Mahender Reddy, Chintala Ramachandra Reddy, MLA, film actors, Rajasekhar and Jeevitha Rajasekhar and large number of disabled people took part in the walk.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X