ఎవ్వరూ ముందుకురాలేదు, మూడుకోట్ల ఫ్లాట్ తాకట్టు: గరుడవేగ కోసం రాజశేఖర్ కష్టాలివి
ఇప్పుడు సక్సెస్ వచ్చింది కాబట్టి ఓకే గానీ ఒక వేళ ఏమాత్రం తేడా చేసినా ఈసారి కూడా రాజశేఖర్‌కి మళ్ళీ మూడుకోట్లకు పైగా నష్టం వచ్చేదట. అది రెమ్యునరేషన్ లాస్ కాదు. సొంత ఆస్తిని కోల్పోవాల్సి వచ్చేది.
Recommended Video

దాదాపు పదేళ్ళ పాటు ఒక్క సక్సెస్ కోసం ఎదురు చూసాడు సీనియర్ హీరో.. ఒకప్పుడు యాంగ్రీ యంగ్ మాన్ ఆఫ్ టాలీవుడ్ అని పిలిపించుకున్న రాజ షేఖర్ తర్వాతి కాలం లో మిగతా హీరోలతో సమానం గా రాణించలేకపోయినా.., తానుమాత్రం సినిమా మీద సినిమాగా ట్రై చేస్తూనే ఉన్నాడు.. దాదాపు పదేళ్ళ కిందట వచ్చిన "ఎవడైతే నాకేంటీ" తప్ప ఆ స్థాయి హిట్ ఒక్కటికూడా లేదు. అయినా నిరాశ పడలేదు.. ఈ పిచ్చిలో దాదాపు వందకోట్లకు పైగా ఆస్థులు నష్టపోయానని అయినా సినిమా మీద ఇష్టం చావలేదనీ ఆవేదనగా చెప్పుకున్నాడు...

వరుస విషాదాలు
ఈ వయసులోనూ గరుడ వేగలో మళ్ళీ ఆనాటి ఉత్సాహం తోనే కనిపించిన రాజశేఖర్ ఈసారి మాత్రం హిట్ కొట్టాడు... అయితే ఈ హిట్ ముందు కూడా వరుస విషాదాలు.... కొన్ని రోజులకిందటే ఆయన తల్లి మరణం, సరిగ్గా రిలీజ్ ఒక్క రోజుముందు బావమరిది శ్రీనివాస్ మరణం ఈ సక్సెస్లోని ఆనందాన్ని తగ్గించేసాయి...

మూడుకోట్లకు పైగా నష్టం వచ్చేదట
అయితే ఇప్పుడు సక్సెస్ వచ్చింది కాబట్టి ఓకే గానీ ఒక వేళ ఏమాత్రం తేడా చేసినా ఈసారి కూడా రాజశేఖర్‌కి మళ్ళీ మూడుకోట్లకు పైగా నష్టం వచ్చేదట. అవును అది రెమ్యునరేషన్ లాస్ కాదు. సొంత ఆస్తిని కోల్పోవాల్సి వచ్చేది... ఫైనాన్స్ తీసుకుని సినిమా తయారుచేసేటప్పుడు బాగానే వుంటుంది.

మూడు కోట్లు ఫైనాన్స్ తీసుకున్నారు.
కానీ విడుదలకు ముందు రోజు అది క్లియర్ చేసి, లెటర్ తీసుకోవడానికి జేజెమ్మ దిగి వస్తుంది. నిర్మాత జీవిత, దర్శకుడు ప్రవీణ్ సత్తారు, హీరో రాజశేఖర్, ఇంకా మరి కొందరు కలిసి తెరకెక్కించిన గరుడ వేగ సినిమా పరిస్థితి ఇదే.ఈ సినిమా కోసం మూడు కోట్లు ఫైనాన్స్ తీసుకున్నారు.

అమ్మకాలు జరగలేదు
గరుడ వేగ మంచి సినిమా అని తెలుసు. ట్రయిలర్, టీజర్ బాగున్నాయి అని తెలుసు. కానీ అమ్మకాలు జరగలేదు. దర్శకుడు ప్రవీణ్ సత్తారు ఇప్పటి వరకు ఈ తరహా సినిమాలు తీయకపోవడం, రాజశేఖర్ నటించి చాలా కాలం కావడం వంటి కారణాలు వున్నాయి.

క్లియరెన్స్ ఎలా?
సినిమాను ఆంధ్రలో సురేష్ మూవీస్ దగ్గర, సీడెడ్ లో సాయి కొర్రపాటి దగ్గర వుంచారు. నైజాంలో మర్కాపురం శివకుమార్ కోటి రూపాయిల అడ్వాన్స్ పై ఆడిస్తా అన్నారు. కానీ మరి ఈ మూడు కోట్ల ఫైనాన్స్ క్లియరెన్స్ ఎలా? థియేటర్ల అడ్వాన్స్ లు ఇలాంటివి ట్రయ్ చేసారు కానీ కాలేదని వినికిడి.

5వేల చదరపు అడుగుల ఫ్లాట్
ముందురోజు ఉదయం నుంచి రాత్రి వరకూ ఎంత ప్రయత్నించినా క్లియరెన్స్ రాకపోవడంతో.. చివరకు మంచి పోష్ ఏరియాలోని తన 5వేల చదరపు అడుగుల ఫ్లాట్ ను తాకట్టు పెట్టి మరీ 3 కోట్ల ఫైనాన్స్ క్లియర్ చేసుకున్నాడట. కానీ ఇప్పుడు మూవీకి మంచి టాక్ వచ్చింది.

ఫ్లాట్ ను మళ్లీ విడిపించుకునే అవకాశాలు పుష్కలం
ఇంకా శాటిలైట్ హక్కులు విక్రయించాల్సి ఉండడం.. మూవీకి మంచి కలెక్షన్స్ కంటిన్యూ అవుతుండడంతో.. త్వరలోనే తన ఫ్లాట్ ను మళ్లీ విడిపించుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. తన ఫ్లాట్ తిగి వస్తుంది అది వేరే విషయం గానీ ఒక్క సినిమాని బయటికి తేవాలనుకుంటే నిర్మాతలు పడే కష్టాలు ఎలా ఉంటాయో తెలుసుకోవటానికి ఇదే పెద్ద ఉదాహరణ.


Click it and Unblock the Notifications











