»   » అవన్నీ పుకార్లే.... కుమార్తె తెరంగేట్రం పై స్పందించిన జీవితారాజశేఖర్

అవన్నీ పుకార్లే.... కుమార్తె తెరంగేట్రం పై స్పందించిన జీవితారాజశేఖర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

సినీ ప్రపంచం లో ఏ విషయమైనా వెంటవెంటనే వ్యాపించి పోతుంది. సామాన్య జనానికి సినిమా వాళ్ళ మీద ఉండే ఆసక్తివల్ల కూడా ప్రతీ వార్తా అసలు విషయానికి మరికొంత రంగు పులుముకుంటూ పోతాయి. రాజశేఖర్ - జీవిత దంపతుల కుమార్తె శివాని సినిమాల్లోకి రానున్నట్టుగా, కొన్ని రోజులుగా వార్తలు వినిపించాయి యువ నటుడు నాగశౌర్య హీరోగా నటించే ఓ చిత్రంలో శివాని హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతోందనీ. ఇదో థ్రిల్లర్‌ కథ అనీ. తెలుగులో అగ్ర నిర్మాణ సంస్థగా వెలుగుతున్న వారాహి బ్యానర్ పై నిర్మింతం కానుందని, కొర్రిపాటి సాయి నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనున్నదని చెప్పుకున్నారు. శివాని ఇప్పటికే వందకు వంద అనే సినిమాలో నటించింది. కాగా ఆ మూవీ రిలీజ్ కి నోచుకోలేదు.

సాయి కొర్రపాటి నిర్మాణంలో నాగశౌర్య హీరోగా చేయనున్న సినిమా ద్వారా శివాని పరిచయం జరగనున్నట్టుగా చెప్పుకుంటున్నారు. రాజశేఖర్, జీవత దంపతులకు ఇద్దరు పిల్లలు. ఇద్దరూ ఆడపిల్లలే. శివాని, శివాత్మిక వారి పేర్లు. వారు ఇధ్దరు అంటే తల్లి తండ్రులకు భలే మురిపెం. తమ పిల్లలను చాలా ప్రేమగా ,గారాబంగా పెంచుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు పెద్ద అమ్మాయిని హీరోయిన్ గా లాంచ్ చేస్తున్నారు.

నాగశౌర్య తో శివాని తెరంగేఅట్రం చేయనుందనే ఈ ప్రచారంలో ఎంతమాత్రం నిజం లేదని ఆమె తల్లి జీవిత చెప్పింది. శివాని సినిమాల్లోకి రావడం లేదనీ, ఒకవేళ ఏదైనా మంచి స్క్రిప్ట్ దొరికితే ఆలోచన చేస్తామని అంది. ఇక నిర్మాత సాయి కొర్రపాటి కూడా ఈ విషయంపై స్పందిస్తూ, తమ బ్యానర్ పై నాగశౌర్యతో ఒక సినిమా చేయనుండటం నిజమే కానీ. కథానాయికగా రాజశేఖర్ కూతురిని తీసుకున్నామనే వార్తల్లో మాత్రం నిజం లేదని, అసలు తమ సినిమాకి ఇంకా ఏ హీరోయిన్ ను అనుకోలేదంటూ ఈ పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టారు.

Rajasekhar's daughter to debut as heroine is a fack news?

వారసత్వంగా హీరోల కొడుకులు హీరోలు అయితే వారి అభిమానులు సంతోషిస్తారుగానీ, అదే వారి కూతుళ్లు హీరోయిన్ అయితే మాత్రం అంగీకరించరు. సూపర్ స్టార్ కృష్ణ తనయ మం జులకు సినిమాల్లో నటించడమంటే చాలా ఇష్టం. హీరోయిన్ అవ్వడానికి ఓసారి రంగం కూడా సిద్ధమయ్యింది. కానీ కృష్ణ అభిమానుల నుంచి వచ్చిన వ్యతిరేకత కారణంగా మంజుల హీరోయిన్ అవ్వలేకపోయింది.

ఇప్పుడిప్పుడే హీరోల కూతుళ్లు కూడా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి నిలదొక్కుకునే వాతావరణం మొదలయ్యింది . ఇప్పటికే బాలీవుడ్‌లో అలనాటి హీరోల ముద్దుల కూతుళ్లు హీరోయిన్లుగా అరంగేట్రం చేసి బ్రహ్మాండంగా కొనసాగుతున్నారు. తెలుగులో మంచు లక్ష్మీప్రసన్న వరుసగా సినిమాలు చేస్తూనే ఉంది. ఇక తమిళంలో సీనియర్ హీరో శరత్ కుమార్ తనయ వరలక్ష్మీ, యాక్షన్ కింగ్ అర్జున్ తనయ ఐశ్వర్య హీరోయిన్లుగా అరంగేట్రం చేసారు... ఇదే దారిలో వచ్చే వారసత్వ కథానాయిక గా శివాని కూడా రానుంది. అయితే ఆ రాక నాగశౌర్యతో మాత్రం కాదన్న మాట...

English summary
There are reports of Jeevitha Rajasekhar’s daughter Sivani making her debut opposite Naga Shourya, in a film produced by Sai Korrapati. However, Jeevitha and Sai Korrapati have both denied the rumour.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu