రాజశేఖర్ కూతురుపై కేసు పెట్టలేదు, కానీ రూ. 30 లక్షలు డిమాండ్!
హీరో రాజశేఖర్ కూతురు శివానీ కారు యాక్సిడెంటుకు గురైంది. ఆగి ఉన్న మరో కారును ఢీకొట్టింది. శివానీ నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రమాదం జరిగింది. బాధితుడు భారీగా నష్టపరిహారం డిమాండ్ చేస్తున్నట్లు టాక్.
రాజశేఖర్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులంతా 'పిఎస్‌వి గురుడవేగ' మూవీ విజయోత్సవ సంబరాల్లో ఉన్నారు. మరి ఈ సంతోషమో, లేక మరేదైనా పరధ్యానమో తెలియదు కానీ రాజశేఖర్ కూతురు శివానీ కారు డ్రైవ్ చేస్తూ ఆగిఉన్న కారును గుద్దేసింది.
జూబ్లీహిల్స్ రోడ్ నెం.71లో తన ఎండీవర్ కారును డ్రైవ్ చేసుకుంటూ శివానీ వెలుతుండగా... అదుపు తప్పింది. రోడ్డుపక్కన పార్క్ చేసి ఉన్న ఖరీదైన జీపును ఢీ కొట్టింది. అయితే విషయం పోలీసుల వరకు వెళ్లకుండా రాజీకుదుర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు.

తన ఖరీదైన వాహనాన్ని బాగు చేయించుకోవడానికి సదరు జీప్ ఓనర్ రూ. 30 లక్షలు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. ఈ విషయమై ఇరు వర్గాల మధ్య చర్చలు జరుగుతున్నాయట. 'పిఎస్‌వి గరుడవేగ' సినిమా విడుదల ముందు రాజశేఖర్ కూడా పీవి ఎక్స్‌ప్రెస్ వే మీద మరో కారును ఢీ కొట్టిన సంగతి తెలిసిందే. ఈ కేసు కూడా పోలీస్ కేసు కాకుండా సెటిల్ చేసుకున్నారు.


Click it and Unblock the Notifications











