రాజశేఖర్ హిట్టు కొట్టాడా? ‘కల్కి’ ట్విట్టర్ టాక్ ఎలా ఉందంటే..

ఒకప్పడు యాంగ్రీ యంగ్ మ్యాన్‌గా వరుస విజయాలు అందుకుంటూ దూసుకెళ్లిన రాజశేఖర్... ఆ తర్వాత వెనకబడిపోయారు. అయితే 'పిఎస్‌వి గరుడవేగ' సినిమా తర్వాత ఆయన కెరీర్ మళ్లీ ఊపందుకుంది. రాజశేఖర్‌లో బాక్సాఫీసు వద్ద కలెక్షన్లు కురిపించగల సత్తా ఉందని ఆ సినిమా నిరూపించడమే అందుకు కారణం. రాజశేఖర్ తాజాగా 'కల్కి' అనే చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ మూవీపై మంచి హైప్ రావడానికి కారణం అయ్యాయి. భారీ అంచనాలతో విడుదలైన ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. కొందరు ఆడియన్స్ ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలు వెల్లడించారు.

ఎలాంటి ఆసక్తి లేకుండా మొదటి భాగం

ఎలాంటి ఆసక్తి లేకుండా మొదటి భాగం

కల్కి ఫస్టాఫ్ చాలా పూర్. ఎలాంటి ఆసక్తి లేకుండా సాగింది. ప్రశాంత్ వర్మ నుంచి ఇలాంటి స్క్రీన్ ప్లే ఊహించలేదు. రాజశేఖర్ తను పోషించిన పాత్రలో ఫిట్ అయ్యేందుకు చాలా స్ట్రగుల్ అయ్యాడు. కథ సైతం ఆకట్టుకోలేదు... అంటూకొందరు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు.

సింప్లీ సూపర్బ్

సింప్లీ సూపర్బ్

ఇప్పుడే కల్కి చూశాను. దర్శకుడు ప్రశాంత్ వర్మ, రాజశేఖర్, అదా శర్మకు కంగ్రాట్స్. ఈ సినిమాపై వన్ వర్డ్ రివ్యూ... సింప్లీ సూపర్బ్. నా రేటింగ్ 3/5 అంటూ ఓ అభిమాని ట్వీట్ చేశారు. రాజశేఖర్, ప్రశాంత్ వర్మ అభిమానుల నుంచి ఈ చిత్రానికి పాజిటివ్ కామెంట్స్ వస్తున్నాయి.

బ్యాడ్ ఫస్టాఫ్, రోటీన్ స్టోరీ

బ్యాడ్ ఫస్టాఫ్, రోటీన్ స్టోరీ


‘కల్కి' మూవీ ఫస్టాఫ్ అంతగా ఆకట్టుకోలేదని, బ్యాడ్ అంటూ కొందరు కామెంట్స్ చేశారు. సినిమా కథ కూడా రోటీన్‌గా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చాలా మంది ఈ సినిమా ఫస్టాఫ్ మీద అసంతృప్తి వ్యక్తం చేస్తూ ట్వీట్స్ చేస్తున్నారు.

మూడు రేటింగ్ ఇవ్వొచ్చు

మూడు రేటింగ్ ఇవ్వొచ్చు


రాజశేఖర్ పోలీస్ పాత్రలు ఇష్టపడే అభిమానులు ఈ చిత్రానికి 3/5 రేటింగ్ ఇవ్వొచ్చనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తన్నారు. ఆయన నటన బావుందని, సినిమా ఆసక్తికరంగా సాగిందంటూ ట్విట్టర్లో పేర్కొంటున్నారు.

మిశ్రమ స్పందన

మిశ్రమ స్పందన

ఓవరాల్ రిపోర్ట్స్ పరిశీలిస్తే ‘కల్కి' యావరేజ్ అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. తొలి సగభాగంతో పోలిస్తే రెండో భాగం కాస్త బెటర్ అనే ఓపీనియన్స్ వ్యక్తం అవుతున్నాయి. అయితే స్క్రీన్ ప్లే ఆకట్టుకోలేదని, కథ చెప్పిన విధంగా కూడా బాగోలేదని, ప్రశాంత్ వర్మ డిసప్పాయింట్ చేశాడని అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X