ప్రీ రిలీజ్ బిజినెస్ అదుర్స్: రాజశేఖర్ ‘కల్కి’ సరికొత్త రికార్డ్...
Recommended Video
ఒకప్పడు యాంగ్రీ యంగ్ మ్యాన్‌గా వరుస విజయాలు అందుకుంటూ దూసుకెళ్లిన రాజశేఖర్... ఆ తర్వాత వెనకబడిపోయారు. అయితే 'పిఎస్‌వి గరుడవేగ' సినిమా తర్వాత ఆయన కెరీర్ మళ్లీ ఊపందుకుంది. రాజశేఖర్లో బాక్సాఫీసు వద్ద కలెక్షన్లు కురిపించగల సత్తా ఉందని ఆ సినిమా నిరూపించడమే కారణం.
ప్రస్తతం రాజశేఖర్ హీరోగా 'కల్కి' అనే చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ మూవీపై మంచి హైప్ రావడానికి కారణం అయ్యాయి. తాజాగా ఈచిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ సరికొత్త రికార్డ్ నమోదు చేసింది.

రాజశేఖర్ యాక్టింగ్ సినిమాలో హైలైట్
'కల్కి' పాత్రలో రాజశేఖర్ యాటిట్యూడ్, యాక్టింగ్ సినిమాలో హైలైట్ అయ్యేలా ఉంటాయట. 'గరుడవేగ' తర్వాత 'కల్కి'తో ఆయన మరో హిట్ అందుకోబోతున్నారనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఈ చిత్రంలో అదా శర్మ, నందితా శ్వేత, పూజితా పొన్నాడ, స్కార్లెట్ విల్సన్, రాహుల్ రామకృష్ణ, నాజర్, అశుతోష్ రాణా, సిద్ధూ జొన్నలగడ్డ, శత్రు, చరణ్ దీప్, వేణుగోపాల్, 'వెన్నెల' రామారావు, డి.ఎస్.రావు, సతీష్ (బంటి) ఈ చిత్రంలో ప్రధాన తారాగణం.

కల్కి
కల్కి చిత్రాన్ని శ్రీ సత్యసాయి ఆర్ట్స్ అధినేత కె.కె. రాధామోహన్ ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో 28న విడుదల అవుతుండగా... అమెరికాలో ఒక్క రోజు ముందు 27న ప్రీమియర్ షోలు వేస్తున్నారు.కల్కి సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొన్నది. సినిమాకు యు/ఎ సర్టిఫికెట్ లభించింది.


Click it and Unblock the Notifications











