ఫ్యామిలీతో జీవిత రాజశేఖర్ ‘నమో’ సాంగ్ (ఫోటోలు)
హైదరాబాద్: బీజేపీలో చేరిన సినీ దంపతులు జీవిత, రాజశేఖర్ ఆ పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ కోసం తమ శక్తిమేర ప్రచారం చేస్తున్నారు. తాజాగా 'నమో' పేరుతో తెరకెక్కిన నమో సాంగులో రాజశేఖర్ నటించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ పాటను చిత్రీకరించారు. ఈ పాటకు అచ్చు సంగీతం అందించారు. ఈ పాటను ప్రసాద్ లాబ్స్ లో విడుదల చేసారు.
ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ...ప్రస్తుతం మన దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని, ఇలాంటి పరిస్థితుల్లో మోడీ లాంటి బలమైన నాయకుడి పరిపాలన కావాలి, అప్పుడే మనకు మంచి జరుగుతుంది అని హీరో రాజశేఖర్ తెలిపారు. జీవిత మాట్లాడుతూ...
మన తలరాతను మార్చుకోవడానికి ఇదే సరైన సమయం, ఎన్నికల సమయంలో తప్పితే మన గీతను మనం మార్చుకోలేం. ఇప్పుడే ఆలోచించి దేశాన్ని మంచి మార్గంలో నడిపించే నాయకుడ్ని ఎన్నుకోవాలన్నారు.
ఇతర వివరాలు, ఫోటోలు స్లైడ్ షోలో............

కిషన్ రెడ్డి మాట్లాడుతూ...
జీవిత మా పార్టీలో చేరాక తన వంతుగా ఎన్నికల ప్రచారం చేస్తానని చెప్పారు. వాటిని మాటలకే పరిమితం చేయకుండా చేతల్లో చూపించారని తెలిపారు.

దేశ పరిస్థితికి అద్దం పట్టేలా
రాజశేఖర్ తెరకెక్కించిన ‘నమో' సాంగు చాలా బాగుందని, దేశంలోని పరిస్థితులకు అద్దం పట్టే విధంగా ఆ పాట ఉందని పలువురు అభిప్రాయ పడ్డారు.

ఇబ్బందుల వల్లే లేట్
ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన మోడీ సభలో ఈ పాటను విడుదల చేయాల్సి ఉంది. కొన్ని ఇబ్బందుల వల్ల అలా చేయలేకపోయామని తెలిపారు.

మోడీ ఆసక్తి
ఈ పాట పట్ల మోడీ చాలా ఆసక్తిగా ఉన్నారని, త్వరలోనే ఆయన ఈ సీడీని వీక్షిస్తారని కిషన్ రెడ్డి తెలిపారు.
ఫ్యామిలీతో జీవిత రాజశేఖర్ ‘నమో’ సాంగ్ (ఫోటోలు)
ఫ్యామిలీతో జీవిత రాజశేఖర్ ‘నమో' సాంగ్


Click it and Unblock the Notifications











