Just In
- 31 min ago
షూటింగ్‌కు సిద్ధమైన మహేశ్ డైరెక్టర్: ఆ తరహా కథతో ప్రయోగం చేయబోతున్నాడు
- 33 min ago
ఆ డబ్బులేవో నువ్వే ఇవ్వొచ్చు కదా?.. యాంకర్ సుమ పోస్ట్‌పై నెటిజన్ల కామెంట్స్
- 1 hr ago
గ్యాప్ తర్వాత అదరగొట్టేసిన అమలా పాల్: ఆమెను అలా చూసి ఆశ్చర్యపోవడం ఖాయమట
- 1 hr ago
ప్రభాస్ పేరు చెప్పి మోసం: లక్షల రూపాయలు కాజేసిన ముఠా.. ఆ ప్రొడక్షన్ హౌస్ పనే ఇదంతా
Don't Miss!
- Sports
క్రికెట్ చరిత్రలోనే అరుదైన ఘటన.. ఒకే బంతికి ఒకే బ్యాట్స్‌మన్ రెండు సార్లు రనౌట్! వీడియో
- News
ఎన్నికల వేళ కేంద్రం మరో తాయిలం -బోడో రీజియన్‌కు రూ.500 కోట్లు -అస్సాంలో అమిత్ షా ప్రకటన
- Finance
బడ్జెట్, మొబైల్ యాప్‌లో 14 డాక్యుమెంట్ల పూర్తి వివరాలు
- Lifestyle
రాత్రుల్లో లోదుస్తులు ధరించకుండా ఒక వారం పాటు నిద్రించండి,ఏం జరుగుతుందో చూడండి, ఆశ్చర్యపోతారు
- Automobiles
బైడెన్ ఉపయోగించే 'మృగం' లాంటి కారు గురించి కొన్ని ఆసక్తికర విషయాలు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఇక రాజశేఖర్ కూడా మొదలెట్టాడు... మదన్ ఎవరో కాదు ఈయన మేనల్లుడేనట..
ప్రముఖ నటుడు డాక్టర్ రాజశేఖర్ ఇక తను హీరోగా రాణించే సమయం అయిపోయిందనుకున్నాడో ఏమో గానీ తన మేనల్లున్ని తెరముందుకు తీసుకొచ్చాడు. నటవారసుల హవా నడుస్తున్న సమయం లోనే తన చెల్లెలి కొడుకు "మదన్" ని రంగం లోకి దింపాడు. జేకే మూవీ మేకర్స్ బ్యానరుపై ఎ.జయకుమార్ నిర్మిస్తున్న చిత్రం '88' లో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో ఉపాసనరాయ్ హీరోయిన్‌గా నటిస్తోంది. 2015లో మిస్ ఇండియా (ఆసియా)గా ఈమె ఎంపికై గుర్తింపు సొంతం చేసుకుంది.
ఈ సినిమాకు హీరో నే కాదు కథ, స్క్రీన్‌ప్లే, మాటలు అందించడంతోపాటు దర్శకత్వం కూడా మదన్ నే చేస్తూన్నాడట. సినిమా గురించి ఆయన మాట్లాడుతూ.. ''నేటి సాంకేతిక పరిజ్ఞానం చాలా అద్భుతం. చాలా అభివృద్ధి చెందాం. కానీ ఇది అపాయకరంగానూ మారుతోంది. టెక్నాలజీ మన సంస్కృతి, సంప్రదాయాలను ఎలా నాశనం చేస్తోందో ఇందులో చెబుతున్నాం.
మనం కొన్ని విషయాలను చాలా గోప్యంగా ఉంచుతాం. అలాంటివి బహిరంగ పరిస్తే వచ్చే సమస్యలపై ఈ సినిమాలో ప్రస్తావించాం. ఓ మంచి సందేశాన్ని వాణిజ్య హంగులతో అందిస్తున్నాం. చెన్నై, కుంభకోణం, కేరళ తదితర ప్రాంతాల్లో చిత్రీకరణ జరిపామని" తెలిపారు.
88 మదన్ గురించి మరికొన్ని వివరాలు స్లైడ్ షో లో...

హీరో రాజశేఖర్ ...
1985లో ప్రతిఘటన చిత్రంతో తెలుగులో హీరోగా కెరీర్ ప్రారంభించారు. వందేమాతరం, తలంబ్రాలు, అంకుశం, ఆహుతి, అల్లరి ప్రియుడు, అన్న, మా ఆయన బంగారం ఇలా తనకు మాత్రమే ప్రత్యేకం అయిన పాత్రల్లో నటిస్తూ మంచి నటుడు అనే ముద్ర వేసుకున్నారు.

ఇక రాజశేఖర్ కూడా మొదలెట్టాడు... మదన్ ఎవరో కాదు ఈయన మేనల్లుడేనట..
'యాంగ్రీ యంగ్‌మెన్'గా తెలుగు తెరపై ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన హీరో రాజశేఖర్ ఎన్నో ఏళ్లుగా ఓ హిట్టు కోసం పరితపించి పోతున్నాడు యాంగ్రీ యంగ్‌మెన్ రాజశేఖర్. మధ్యలో ఎవడైతే నాకేంటి?, గోరింటాకులు కాస్త బాగానే ఆడాయి కానీ కెరీర్ లో మాత్రం అనుకున్నంత మార్పేమీ రాలేదు.

ఇక రాజశేఖర్ కూడా మొదలెట్టాడు... మదన్ ఎవరో కాదు ఈయన మేనల్లుడేనట..
అయితే అటు రాజకీయాల్లోనూ సరైన పేరు రాక, ఇటు సినిమా అవకాశాలూ తగ్గిపోయి కొంత కాలం గా సైలెంట్ అయిపోయాడు ఈ "మగాడు" హీరో.

ఇక రాజశేఖర్ కూడా మొదలెట్టాడు... మదన్ ఎవరో కాదు ఈయన మేనల్లుడేనట..
గత కొంతకాలంగా ఎలాంటి సినిమాలు చేయాలో తెలియక కన్‌ఫ్యూజన్‌లో పడిపోయాడు. చిరంజీవి సినిమాల్లో రీ-ఎంట్రీ ఇస్తే, అందులో విలన్‌గా నటించాలని వుందంటూ చాలా సందర్భాల్లో రాజశేఖర్ చెప్పాడు కూడా..

ఇక రాజశేఖర్ కూడా మొదలెట్టాడు... మదన్ ఎవరో కాదు ఈయన మేనల్లుడేనట..
ఇక తను హీరోగా రాణించే సమయం అయిపోయిందనుకున్నాడో ఏమో గానీ తన మేనల్లున్ని తెరముందుకు తీసుకొచ్చాడు. నటవారసుల హవా నడుస్తున్న సమయం లోనే తన చెల్లెలి కొడుకు "మదన్" ని రంగం లోకి దింపాడు.

ఇక రాజశేఖర్ కూడా మొదలెట్టాడు... మదన్ ఎవరో కాదు ఈయన మేనల్లుడేనట..
మదన్ హీరోగా ‘88' అనే చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి కథ, కథనం, మాటలు అందించి దర్శకత్వం వహిస్తుంది కూడా మదనే కావడం విశేషం. జేకే మూవీ మేకర్స్ పతాకంపై ఎ.జయకుమార్ నిర్మిస్తున్నారు. ఇందులో మదనకు జోడీగా మిస్ ఇండియా ఏసియా 2015 ఉపాసనరాయ్ నటిస్తోంది.

ఇక రాజశేఖర్ కూడా మొదలెట్టాడు... మదన్ ఎవరో కాదు ఈయన మేనల్లుడేనట..
జయప్రకాశ్, డేనియల్ బాలాజీ, మీరా కృష్ణన్, పవర్‌స్టార్, శ్యామ్స్, అప్పుకుట్టి, చాప్లిన్‌బాలు, చేరన్‌రాజ్, బాయ్స్ రాజన్‌లు ఇతర తారాగణం. దయారత్నం సంగీతం సమకూరుస్తున్నారు. అరివుమది, మదన్‌కార్కి పాటలు రాశారు..

ఇక రాజశేఖర్ కూడా మొదలెట్టాడు... మదన్ ఎవరో కాదు ఈయన మేనల్లుడేనట..
‘నేటి ప్రపంచాన్ని శాసిస్తున్న సాంకేతిక విప్లవంతో మంచితోపాటు చెడు కూడా జరుగుతోంది. ఆ సాంకేతిక మన సంస్కృతి సంప్రదాయాల్ని నాశనం చేస్తోంది. దీనిపై ప్రజలకు సందేశాన్నిస్తూ ‘88' చిత్రాన్ని నిర్మిస్తున్నారట.

ఇక రాజశేఖర్ కూడా మొదలెట్టాడు... మదన్ ఎవరో కాదు ఈయన మేనల్లుడేనట..
ఆ మధ్య మదన్ హీరో గా తెలుగు లోనే 50 ఏళ్ల క్రితం పార్వతీపురం అనే గ్రామంలో జరిగిన సంఘటనలతో ‘పార్వతీపురం' అనే సినిమా ‘మోస్ట్ డేంజర్" అనే ఉప శీర్శిక తో మొదలై ఒక పాత చిత్రీకరన కూడా జరిగింది. కానీ అది మధ్య లోనే ఆగిపోయింది.

ఇక రాజశేఖర్ కూడా మొదలెట్టాడు... మదన్ ఎవరో కాదు ఈయన మేనల్లుడేనట..
ఇక ఆ సంఘటన తో కాస్త దిసప్పాయింట్ అయిన మదన్ తానే స్వయంగా రంగం లోకి దిగి కథ రాసుకున్నాడు.... ఇక దర్శకత్వం కూడా తానే చేయాలనుకుని ఇప్పుడు 88 తో తన ప్రయత్నం మొదలు పెట్టాడు. చూద్దాం మరేమౌతుందో...