'సత్యమేవ జయతే' చిత్రంలో సంభాషణల రూపంలో రాజశేఖర్ పరోక్షంగా చిరంజీవిపై అక్కసు వెళ్లగక్కరు. ఒక పోస్టర్ లో తనతో పాటు మదర్ థెరిస్సా ఫోటో వేసుకున్న క్యారెక్టర్ నటి అపూర్వతో 'మదర్ ఏమైనా నీకు ప్రమోటరా? ఛారిటీ అనేది ఇంట్లోంచే మొదలవ్వాలి' అని రాజశేఖర్ విరుచుకుపడతారు. మరో సందర్భంలో 'పనికి మాలిన పార్టీలు చాలానే పుట్టుకొచ్చాయ్...పోయి వాటిలో చేరు' అనే ప్రయోగమూ ఉంది. రాజశేఖర్ ఈ చిత్రానికి సంభాషణల క్రెడిట్ కూడా ఇచ్చుకున్నారు. అలాగే 'సత్యమేవ జయతే' టైటిల్ కార్డ్స్ లో రాజశేఖర్ పేరుకు ముందు 'మహాస్టార్' అని వేశారు.మహాస్టార్ అనేది మెగాస్టార్ కు దగ్గరగా ఉండటమే ఇప్పుడు పలువురు దృష్టిని ఆకర్షిస్తూ చర్చనీయాంశమవుతోంది.
Story first published: Saturday, February 14, 2009, 18:13 [IST]