గరుడవేగ కష్టాలు తీర్చలేదా? హక్కుల అమ్మకాలు జీవితని చిక్కుల్లో పడేశాయ్

Recommended Video

జీవితని చిక్కుల్లో పడేసిన గరుడవేగ..!

పీఎస్వీ గరుడ వేగ కొన్ని సంవత్సరాల తర్వాత రాజశేఖర్ ఖాతాలో పడ్డ మంచి హిట్, గత కొన్నేళ్ళుగా రీమేకులమీదే ఆధార పడ్డ రాజశేఖర్ వరుస ఫ్లాపులతో ఆర్థికంగా కూడా బాగానే నష్టపోయిన సమయం లో వచ్చిన గరుడ వేగ ఆ దాహాన్ని తీర్చింది. అయితే ఈ సినిమా తెచ్చిన ఆనందం ఆర్థికంగా అయితే కాదట గరుడవేగకు సంబంధించి ఫైనాన్స్ లు ఇంకా వున్నాయి.

అప్పులు చాలా వున్నాయి

అప్పులు చాలా వున్నాయి

గరుడవేగ కోసం చేసిన అప్పులు చాలా వరకు అలాగే వున్నాయి. విడుదలకు ముందు రోజు రాత్రి మూడుకోట్ల అప్పుకు కోటి బాకీ తీర్చి, రెండు కోట్లకు ఫ్లాట్ గ్యారంటీ పెట్టి సేల్ డీడ్ రాశారు. దాంతో పాటు వరల్డ్ డిజిటల్, రీమేక్ రైట్లు హామీగా రాసి ఇచ్చినట్లు తెలిసింది.

 ఒకరికి తెలియకుండా మరొకరికి

ఒకరికి తెలియకుండా మరొకరికి

కానీ ఇదిలా వుంటే, ఇప్పుడు జీవితనే ఒకరికి తెలియకుండా మరొకరికి ఇద్దరికి గరుడవేగ హిందీ డిజిటల్ హక్కులు విక్రయించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో గరుడవేగ నిర్మాత వేరే వాళ్లకు విక్రయించినట్లు తెలుస్తోంది. అంటే ఆ విధంగా ముగ్గురుకి హక్కులు వెళ్లాయి.

 జెమిని టీవీకి నాలుగు కోట్లకు

జెమిని టీవీకి నాలుగు కోట్లకు

అసలు హక్కులు ఫైనాన్స్ ఇచ్చిన వారి దగ్గర వున్నాయి. జెమిని టీవీకి నాలుగు కోట్లకు మాట అయిపోయింది. ఈరోజు అగ్రిమెంట్ కావాల్సి వుంది కానీ ఇప్పుడు ఈ ప్రయత్నం కూడా బెడిసి కొట్టినట్టే ఉంది.... కొనుక్కున్న వారిలో ఓ వ్యక్తి ఇప్పటికే పేపర్ నోటీస్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

హక్కుల విషయంలో

హక్కుల విషయంలో

హక్కుల విషయంలో ముడిపడ్డవారు ముగ్గురు ఓసారి సమావేశమై ఏం చేయాలన్నదానిపై మల్లగుల్లాలు పడినట్లు తెలుస్తోంది. మరో పక్క ఫైనాన్స్ ఇచ్చిన వ్యక్తి కూడా పేపర్ నోటీస్ ఇవ్వాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా ఇప్పుడు ఇన్ని చిక్కులు ముడి పడ్డాయి రాజశేఖర్ చుట్టూ.

నాలుగు కోట్లకి అమ్మినా

నాలుగు కోట్లకి అమ్మినా

ఒక వేళ నిజంగానే నాలుగు కోట్లకి అమ్మినా ఇప్పుడు వచ్చే నాలుగు కోట్లలో మూడు కోట్లు ఒకటే పద్దుకింద చెల్లుబాటుకు పోతుందని వినికిడి. ఇదిలా వుంటే నార్త్ డిజిటల్ రైట్స్ గొడవలు ఇంకా వుండనే వున్నాయి. వాటిని మెల్లగా ఏదో విధంగా సెటిల్ చేసుకుంటారు. ఆపైన రాజశేఖర్ తరువాతి ప్రాజెక్టు ఏమిటన్న దానిపై దృష్టి పెడతారు. మళ్లీ ఇదే బ్యానర్ లో సినిమా నిర్మాణం ప్రారంభించే అవకాశం వుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X