దర్శకేంద్రుడు రాఘవేంద్రరావును కొట్టాననడం అబద్ధం
నాకు బుద్ధి ఉండాలి కదా! రాఘవేంద్ర రావు దగ్గరికి బాగా రాత్రి వేళ వెళ్లడం, నేను తాగేసి ఉండటం...గట్టిగా అరిచాను. కానీ, నేను ఆయనను కొట్టినట్లుగా తప్పుడు ప్రచారం జరిగింది. ఆ తర్వాత దీనిపై నేను..శ్యాంప్రసాదరావు వద్దకు వెళ్ళి బాధపడ్డాను. రాఘవేంద్రరావు గారూ...క్షమించండి!అంటూ నిన్న(ఆదివారం)రాత్రి ఓ లీడింగ్ ఛానెల్ కి రాజశేఖర్ ఇచ్చిన ఇంటర్వూలో ఇలా స్పందించారు. అప్పట్లో ఆయన రాఘవేంద్రరావుని కొట్టారంటూ వార్తలు వచ్చిన నేపధ్యంలో ఈ ప్రశ్నను మీడియావారు రాజశేఖర్ ముందు ఉంచారు. అలాగే అందులో తప్పు నాదే.నాకున్న బుర్ర, మెచ్యూరిటీ తక్కు వ! చిన్న విషయాన్ని ఆయన వద్దకు తీసుకెళ్లి గట్టిగా అడగడం తప్పే. కొందరు ఆడవాళ్లే నాకు ఇలా ఎక్కించారు అన్నారు.
ఈ విషయమై రాజశేఖర్ భార్య జీవిత అప్పడు జరిగిన విశేషాన్ని చెప్పుకొచ్చింది..నాకు చెల్లెలు ఉంది. తనూ గుడ్ లుకింగ్. ఆమెను కూడా సినిమాల్లోకి తీసుకొద్దామని రాఘవేంద్రరావు అనుకున్నారు. కొందరు రాజశేఖర్‌కు తప్పుడుగా చెప్పారు. అప్పుడు ఈ సంఘటన జరిగింది. ఆ తర్వాత రాజశేఖర్ ఈ విషయమై చాలా రోజులు బాధపడ్డారు. ఏడ్చారు కూడా! కొన్ని సంబంధాలు బ్రేక్ అయినా పట్టించుకోం. కానీ... రాఘవేంద్రరావుతో జరిగిన విషయంపై ఇద్దరం ఇప్పటికీ బాధ పడుతూనే ఉన్నాం. తర్వాత నేను వెళ్లి ఆయనతో మాట్లాడాను అన్నారు. ఇక రాఘవేంద్రరావు అప్పటి వరకూ యాంగ్రీ యంగ్ మ్యాన్ ఇమేజ్ తో ఉన్న రాజశేఖర్ కి అల్లరి ప్రియుడుతో కొత్త కోణాన్ని వెలికి తీసి సూపర్ హిట్ ఇచ్చారు.


Click it and Unblock the Notifications











