పవన్ పై మళ్ళీ రాజశేఖర్

ఈ మధ్య నాకు ఎక్కువగా అమ్మాయిల దగ్గర నుండి ఫోన్ కాల్స్ వస్తున్నాయి. వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు. కానీ ఫోన్లు అయితే చేస్తున్నారు. అంటే నాపై ఏదో కుట్ర జరుగుతోందన్నమాట...అన్నారు నవ్వుతూ..అలాగే ఈ మధ్య మా ఇంట్లో పనిమనిషికి జీవిత అన్నం పెట్టకుండా పనిచేయించుకుంటోందని,అభమాని కుటుంబానికి నేను ఇచ్చిన చెక్ బౌన్స్ అయిందని...ఇలా నాపై రూమర్స్ చాలా వచ్చాయి, వస్తున్నాయి. నేను ఇవేమీ లక్ష్య పెట్టను. నిజం నాకు తెలుసు...ఆ భగవంతుడుకి తెలుసు..భవిష్యత్ లో కూడా నాపై ఇంకా చాలా రూమర్స్ వస్తాయిని అనుకుంటున్నాను.
గత కొంతకాలంగా ఏదో ఒక గొడవలో నా పేరు వినిపించటం మామూలైపోయింది. కానీ ఒక్క మాట చెప్తున్నాను. ఆడదాన్ని కొట్టే మనస్తత్వం కాదు నాది. సత్యమేవ జయితే లో చేసిన నీతూ చంద్రకు క్రమశిక్షణ తక్కువ. అప్పటికీ ఆ అమ్మాయికి సౌకర్యంగా ఉండే సమయంలోనే షూటింగ్ జరిపాం. కానీ చివర్లో మమ్మల్ని అఆప్ సెట్ చేసింది. అది మినహాయిస్తే...షూటింగ్ అంతా ఎంతో సరదాగా గడిచిపోయింది అన్నారు.


Click it and Unblock the Notifications











