నాగబాబు సెట్ చేసాడు: చిరు-రాజశేఖర్ ఫ్రెండ్స్
హైదరాబాద్: తెలుగు సినిమా మెగాస్టార్ చిరంజీవికి.......జీవిత, రాజశేఖర్ దంపతులకు మధ్య గత కొన్నేళ్లుగా విబేధాలు నడుస్తున్న సంగతి తెలిసిందే. పలుసందర్భాల్లో వీరి మధ్య విబేధాలు రచ్చకెక్కాయి. అనేక మీడియా సమావేశాల్లో జీవిత రాజశేఖర్ దంపతులు చిరంజీవిపై వివిధ అంశాలపై విమర్శల వర్షం కురిపించారు.
అయితే ఇపుడు చిరంజీవితో విబేధాలు ఏమీ లేవు...పరిష్కారం అయ్యాయి అంటున్నారు రాజశేఖర్. నాగబాబు మధ్యవర్తిగా వ్యవహరించి వీరి మధ్య ఉన్న విబేధాలు తొలగిపోయేలా చేసారట. మా ఫ్యామిలీ ఈ వెంటులో భాగంగా త్వరలోనే చిరంజీవిని మా ఇంటికి ఆహ్వానిస్తాను అని రాజశేఖర్ చెప్పుకొచ్చారు.

ఆ మధ్య ఓ టీవీ కార్యక్రమంలో కూడా రాజశేఖర్ సంచనల వ్యాఖ్యలు చేసారు. చిరంజీవి సినిమాలో అవకావం వస్తే విలన్ పాత్ర చేస్తాను అని రాజశేఖర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. మొత్తానికి చిరంజీవి, రాజశేఖర్ మధ్య విబేధాలు తగ్గు ముఖం పట్టడం, ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ కావడంతో ఇద్దరు వర్గాల ఫ్యాన్స్ ఆనందంగా ఉన్నారు.


Click it and Unblock the Notifications











